సచిన్ కు ఆర్బిఎస్ స్వస్తి?
ముంబైః ప్రముఖ భారతీయ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తో తాను చేసుకున్న బ్రాండ్ అంబాసిడర్ వొప్పందాన్ని రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్ ల్యాండ్ (ఆర్బిఎస్)సమీక్షించనుంది. ఆర్బిఎస్ భారత దేశ బ్రాండ్ అంబాసిడర్ గా అయిదేళ్లపాటు వ్యవహిరించేందుకు సచిన్ టెండూల్కర్ తో ఒప్పందం జరిగింది. అయితే సబ్ ప్రైమ్ సంక్షోభం దెబ్బకు ఆర్బిఎస్ డబ్బు కొరత సమస్యలోకి పీకల దాకా దిగబడింది. దాంతో ఆర్బిఎస్ కు 28 బిలియన్ పౌండ్ల నష్టం వచ్చేట్లుంది. అయితే సచిన్ టెండూల్కర్ తో సహా ఇతర బ్రాండ్ అంబాసిడర్ల ఒప్పందాలను సైతం బ్యాంక్ పునఃపరిశీలించనుందని బ్యాంక్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఏబిఎన్ ఆమ్రో సంస్థను 2007లో ఆర్బిఎస్ స్వాధీనం చేసుకున్నప్పటి నుండి భారత దేశ వ్యాపారాభివృద్ధి కోసం సచిన్ టెండూల్కర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసారు.ఆయితే స్వాధీనం చేసుకున్న ఏబిఎన్ ఆమ్రో భారతీయ శాఖకు మరో పేరు ప్రతిపాదన ఇప్పటికీ ఆర్బిఐ పరిశీలనలో ఉంది. బ్యాంక్ క్రికెట్ సంబంధింత ప్రకటనలను సిద్ధం చేసుకుంది. అదే విధంగా భారత్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్ లతో జరుగనున్న వింటర్ సీరీస్ కు ఆర్బిఎస్ స్వాన్సరర్ గా నిలిచింది.
Pages: 1 -2- News Posted: 12 February, 2009
|