సచిన్ కు ఆర్బిఎస్ స్వస్తి?
ఆయితే ఆర్ బిఎస్ ను జాతీయం చేసే అవకాశాలున్న కారణాన స్వాన్సరర్ల కార్యకలాపంపై పునఃసమీక్ష జరిగే అవకాశముంది. సచిన్ టెండూల్కర్ ఆర్బిఎస్ బ్యాంకుకు సంబంధించిన కులీన అంబాసిడర్ల జాబితాలో ఉన్నారు. రేసింగ్ డ్రైవర్ జాకీ స్టీవార్ట్, గోల్ఫర్లు జాక్ నిక్లాస్, లూక్ డొనాల్డ్ లు, చాంపియన్ షో-జంపర్ జరా ఫిలిప్ (ఎలిజబెత్ రాణి మనవరాలు) తదితర ప్రముఖులు ఈ బ్యాంక్ అంబాసిడర్ల జాబితాలో ఉన్నారు. అంబాసిడర్ గా వ్యవహరించినందుకు టెండూల్కర్ 3-4 కోట్ల రూపాయలను పారితోషికం తీసుకున్నట్లు పారిశ్రామిక వర్గాలు తెలియజేశాయి.
సచిన్ టెండూల్కర్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంచుకున్న పలు కంపెనీలు తమ కాంట్రాక్టులను పొడిగించకుండా నిలిపివేస్తున్నాయి. ఫియట్, టివిఎస్, ఎయిర్ టెల్, పెప్సీకో కంపెనీలు టెండూల్కర్ తో ఒప్పందాలు నిలిపివేశాయి. టెండూల్కర్ ప్రస్తుతం అత్యధిక పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదిదాస్, బ్రిటానియా, బూస్ట్, కేనన్, వీసా లాంటి పలు కంపెనీలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి చివరినాటికి ఆర్బిఎస్ తన వార్షిక ఆదాయ వివరాలను ప్రకటించనుంది. ఆర్బిఎస్ భారతీయ శాఖల్లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఉద్యోగ కల్పనా కేంద్రంగా ఆర్బిఎస్ నిలిచింది.
Pages: -1- 2 News Posted: 12 February, 2009
|