షారూక్ ఇక పెప్సీ తాగరు!
న్యూఢిల్లీః షారూక్ ఇక పెప్సీ కోలా తాగే యాడ్స్ లో కనపడరు. ఒక దశాబ్ద కాలంపాటు అత్యంత ప్రతిష్టాత్మక బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగిన బాలివుడ్ బాధ్షా షారూక్ ఖాన్ తో ఒప్పందం రద్దు చేసుకోవాలని సాఫ్ట్ డ్రింక్స్ దిగ్గజం పెప్సీ కోలా నిర్ణయించుకుంది. బెవరేజెస్, స్నాక్స్ వ్యాపార దిగ్గజం తన మార్కెటింగ్ వ్యూహం మార్చుకుంది. 'యంగిస్తాన్' అనే తన సరికొత్త వాణిజ్య ప్రకటన భావనకు అనుగుణంగా వయసుమళ్లిన సెలిబ్రిటీలను వదిలించుకునేందుకు పెప్సీ నిర్ణయించుకుంది. నిరుడు దీర్ఘకాలంగా అంబాసిడర్ గా కొనసాగిన మరో క్రికెట్ సెలబ్రిటీ సచిన్ టెండూల్కర్ తో కాడా పెప్సీ తెగదెంపులు చేసుకుంది.
షారూక్ తో పెప్సీ కాంట్రాక్ట్ 2008 డిసెంబర్ తో ముగుస్తుంది. అయితే ఆ ఒప్పందాన్ని పెప్సీ కొనసాగించదలచుకోలేదు. అదే సమయంలో పెప్సీ కంపెనీ తన అనుబంధం వదలుకోవడం లేదు. షారూక్ ఖాన్ ఐపిఎల్ టీమ్ కోల్ కత నైట్ రైడర్స్ (కెకెఆర్)తో స్పాన్సర్ షిప్ కోసం పెప్సీ కంపెనీ సంప్రదింపులు చేస్తోంది. బెవరేజెస్ , స్నాక్స్ వ్యాపారం కూడా ఈ స్పాన్సర్ షిప్ ఒప్పందంలో ఇమిడి ఉంది. ఐపిఎల్ టీమ్ ఆడే దేశీయ స్టేడియమ్ ల్లో పెప్సీ బ్రాండ్ బెవరేజెస్, స్నాక్స్ అమ్మవలసి ఉంటుంది. వారంలోగా కెకెఆర్ తో ఒప్పందం జరిగే అవకాశముంది.
Pages: 1 -2- News Posted: 13 February, 2009
|