షారూక్ ఇక పెప్సీ తాగరు!
షారూక్, సచిన్ లిద్దరూ పెప్సీ కంపెనీకి మంచి ఖ్యాతి తెచ్చి పెట్టారు. ప్రస్తుతం ధోనీతో పెప్సీ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వయసు మళ్లిన క్రికెటర్లు రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీలతో కూడా నిరుడు పెప్సీ కంపెనీ ఒప్పందాలను రద్దు చేసుకుంది. బాలీవుడ్ యువ నటీనటులను పెప్సీ కంపెనీ కంపెనీ ఆశిస్తోంది. రణబిర్ కపూర్, దీపికా పడ్కోనెలను పెప్సీ కోలా కోసం, కత్రినా కైఫ్ను మ్యాంగో స్లైస్ డ్రింక్ కోసం పెప్సీ ఒప్పందాలు చేసుకోనుంది. క్రికెట్ స్టార్లు ధోని, ఇషాంత్ శర్మ, శ్రాశాంత్ లతో కూడా పెప్సీ అలాంటి ఒప్పందాలను కుదర్చుకోనుంది. గత వేసవిలో, 'యేహై యంగిస్తాన్ మేరీ జాన్' అనే యాడ్ ధీమ్ లో రణబిర్, దీపిక, షారుక్ లు నటించారు. పెప్సి ప్రస్తుతం రణబిర్, దీపికలతో తన యాడ్స్ ను కొనసాగిస్తోంది.
పెప్సీ కంపెనీ మూడు ఐపిఎల్ టీమ్స్ తో స్పాన్సర్ షిప్ కోసం సంప్రదింపులు చేస్తోంది. ఇండియా సిమెంట్స్ కు చెందిన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్ కె), ముఖేష్ అంబానీకి ముంబై ఇండియన్స్ (ఎమ్ ఐ), కెకెఆర్ టీమ్స్తో పెప్సీ సంప్రదింపులు ఫలప్రదమయ్యేట్లు ఉన్నాయి. బోర్డ్ ఆప్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ)తో పెప్సీ కంపెనీ 50 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చున్నట్లు మీడియా కథనాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఒప్పందాలకు సంబందించిన ఫైనాన్స వివరాలు తెలియవు. అయితే ఈ ఒప్పందాల్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారబోతున్నట్లు, బ్రాండ్ ప్రమోషన్ ను పెద్ద ఎత్తున పెంచుకోబోతున్నట్లు అర్థమవుతోంది. వేసవి బెవరేజ్ కంపెనీలకు సీజన్ కాబట్టి ఐపిఎల్ మ్యాచ్ లు బెవరేజెస్ వ్యాపారానికి బ్రహ్మాండమైన వేదికగా నిలుస్తాయి. ఎయిర్ సెల్, రీబక్ కంపెనీలు చెన్నై సూపర్ కింగ్స్ కు స్పాన్సరర్స్ గా ఉన్నాయి. మాస్టర్ కార్డ్, అదిదాస్, లిక్కర్ కంపెనీ పెర్నాడ్ రికార్డ్ స్ రాయల్ స్టాగ్ కంపెనీలు ముంబై ఇండియన్స్ టీమ్ కు స్పాన్సరర్స్ గా వ్యవహరిస్తున్నాయి.
Pages: -1- 2 News Posted: 13 February, 2009
|