ఎజెండా ఎసరు పెడుతుందా?
హైదరాబాద్: ఉమ్మడి ఎజెండా ఇప్పుడు మహాకూటమికి పెద్ద తలనొప్పిలా తయారైంది. ఎజెండాలో తెలంగాణా సాధన ఉండబోదని వామపక్షాలు రెండూ తెగేసి చెప్పడం కూటమిలో భాగమైన తెలంగాణా రాష్ట్ర సమితికి మింగుడుపడటం లేదు. ఉమ్మడి ఎజెండాలో తెలంగాణా సాధన ఒక అంశంగా చేర్చి తీరవలసిందేననని తెరాస పట్టుబట్టడంతో సీట్ల పంపకంపై జరుగుతున్న చర్చలు మందగించాయి. అయితే ఇదేమంత పెద్ద సమస్య కాదని, తెరాసతోపాటు కూటమి నాయకులు పైకి చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అంత సానుకూ లంగా లేనట్టు కనిపిస్తున్నది.
నిన్న మొన్నటి దాకా ఉమ్మడి ఎజెండాపై విధివిధానాలు నిర్ణయించిన తర్వాతే ముందుకు సాగాలని చేసిన ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన వామ పక్షాలు ఇప్పుడు మడతపేచీ పెడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి ఎజెండాకు అంగీకరిస్తే తొలి అం శంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును చేర్చాలని టిఆర్‌ఎస్ చేసిన ప్రతిపాదనకు టిడిపి సూత్ర ప్రాయంగా అంగీకరిం చింది. ఆ హామీ ప్రకారమే టిఆర్‌ఎస్ కూటమిలో చేరింది. తెలంగాణ అంశం పట్ల ఎవరికీ వ్యతిరేకత లేని కారణంగా వామపక్షాలు సహజంగానే అంగీకరిస్తాయన్న నమ్మకంతో టిడిపి ఈప్రతిపాదనకు సరే అన్నది. అయితే ఇప్పుడు వామపక్షాలు టిఆర్‌ఎస్ డిమాండ్‌పై పునరాలోచనతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Pages: 1 -2- -3- -4- -5- News Posted: 15 February, 2009
|