ఎజెండా ఎసరు పెడుతుందా?
ఉమ్మడి ఎజెండా ఉండాల్సిందే
వామపక్షాల అభిప్రాయాలు వేటికవి ఎలా ఉన్నా ఉమ్మడి ఎజెండాతో జనంలోకి వెళ్ళకపోతే కూటమిలోనే అంతర్గతంగా కుమ్ములాటలున్నాయన్న ప్రచారాన్ని కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు తమ ప్రచారంలో హోరత్తి స్తాయని టిడిపి, టిఆర్‌ఎస్ వాదిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభ సమావేశాల చివరి రోజున తెలంగాణపై చేసిన ప్రకటనను తిప్పి కొడుతూ జనంలో చైతన్యం కల్పించాలంటే తెలంగాణకు ప్రథమ తాంబూలం ఇస్తూ ఎజెండా రూపొందించాల్సిందే అని టిడిపి లోని తెలంగాణ నేతలు, టిఆర్‌ఎస్ నాయకత్వం వాదిస్తున్నాయి.
Pages: -1- -2- -3- 4 -5- News Posted: 15 February, 2009
|