ఎజెండా ఎసరు పెడుతుందా?
సిపిఎంకు ఇరకాటం
తమ పార్టీ ఆవిర్భావం నుంచీ భాషా ప్రయుక్త రాషా్ట్ర లను విడదీసేందుకు విముఖంగా ఉందని, రాష్ట్రంలో కాం గ్రెస్‌ను గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతోనే మహా కూటమి ఏర్పాటుకు అంగీకరిస్తూ తెలంగాణ పట్ల పెద్దగా విముఖత చూపలేదని సిపిఎం కొత్త వాదన మొదలు పెట్టినట్టు తాజా సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే తొలి అంశంగా ఎజెండాలో ఏర్పాటు చేయాలన్న టిఆర్‌ఎస్ డిమాండ్‌ను అంగీకరిస్తే తమ పార్టీలో అంతర్గతంగా ఇబ్బందులు ఎదురవుతాయని సిపిఎం నాయకత్వం చెబు తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణను తొలి అంశంగా అంగీకరిస్తే భాషాప్రయుక్త రాషా్టల్రను విడదీసేం దుకు విధానపరంగా అంగీకరించినట్టే అవుతుందని, అదే సమయంలో తమకు ఇతర రాషా్టల్ల్రో ఇబ్బందులు ఎదురవుతాయని సిపిఎం అనుమానిస్తున్నది.
ఉదాహ రణకు పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న సిపిఎం ప్రభుత్వా నికి అక్కడ ఎంతో కాలంగా డిమాండ్ ఉన్న గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర వివాదం మొదటికి వచ్చే అవకాశాలుంటా యన్నది సిపిఎం అనుమానం. తెలంగాణ రాష్ట్రం ఏర్పా టును ప్రథమ అంశంగా కాకుండా అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కూటమిలో ఎవరికీ పెద్ద అభ్యంతరాలు లేవన్న వాక్యాన్ని తొలి వాక్యంగా కాకుండా తొలి పేరాగ్రాఫ్‌లో చేరిస్తే సరిపోతుందన్న ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సిపిఎం ముందుకు తీసుకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై టిడిపి, టిఆర్‌ఎస్ మల్లగుల్లాలు పడుతున్నాయి.
Pages: -1- 2 -3- -4- -5- News Posted: 15 February, 2009
|