ఎజెండా ఎసరు పెడుతుందా?
ఉమ్మడి ఎజెండాయే లేనప్పుడు ఉమ్మడిగా ఎలా ప్రచారం చేస్తారని, తమను ఎలా ఓడిస్తారని కాంగ్రెస్, పిఆర్పీ నాయ కులు తమ ప్రచారంలో ఎద్దేవా చేస్తే జవాబు చెప్పుకునే స్థితి ఉండదని ఈ రెండు పార్టీలు అంటున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు నివాసంలో తొలిసారినాలుగు పార్టీల నేతలు పత్రికల వారితో మాట్లాడినప్పుడు ఉమ్మడి ఎజెండా ఉంటుందని చంద్రబాబు, టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ స్పష్టంగా చెప్పారు. అక్కడే ఉన్న సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్య దర్శులు బివి రాఘవులు, కె.నారాయణ ఏమీ మాట్లాడని విషయాన్ని టిడిపి, టిఆర్‌ఎస్ గుర్తు చేస్తున్నాయి.
తెలంగాణ సాధనను ప్రథమ అంశంగా చేర్చే విషయంపై వామ పక్షాలలో కొన్ని అపోహలు ఉన్న మాట నిజమే అని, వీటిని సర్దుబాటు చేస్తామని టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. త్వరలోనే ఉమ్మడి ఎజెండాపై అంగీకారం కుదురుతుందని, దాని తర్వాతే మహాగర్జన సభ తేదీని ఖరారు చేస్తామని ఆయన వివరించారు. వామపక్షాలు ముందు అంతర్గతంగా మాట్లాడుకుని వారి వారి పార్టీల విధానాల ప్రకారం ఉమ్మడి ఎజెండాలో వామపక్షాల తరఫున చేర్చాల్సిన అంశాలను ప్రతిపాదిస్తే, మిగిలిన అంశాలపై స్పష్టత ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
Pages: -1- -2- -3- -4- 5 News Posted: 15 February, 2009
|