ఎజెండా ఎసరు పెడుతుందా?
ఎజెండా ఎందుకు? సిపిఐ
అసలు ఉమ్మడి ఎజెండా ఆలోచనే కూటమి నాయకత్వానికిలేదని సిపిఐ కొత్తవాదన అందుకున్నది. కాంగ్రెస్‌ను ఓడించాలన్నదే కూటమిలో నాలుగుపార్టీల ఉమ్మడి లక్ష్యం తప్ప ఎవరి ప్రాధాన్యాలను వారు ముందుకు తెచ్చి ఉమ్మడి ఎజెండా తయారుచేయటం అనవసరం అని సిపిఐ భావి స్తున్నది. శుక్రవారం యాదగిరి గుట్టలో పత్రికల వారితో మాట్లాడిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ స్పష్టంగా ఈ విషయం ప్రకటించారు.
ఉమ్మడి ఎజెండాను వద్దనటానికి సిపిఐకి కారణాలు ఉన్నాయి. రెండు వామపక్షాలూ భూ పోరాటాలు ప్రధాన అంశంగా తమ మేనిఫెస్టోలను తయారు చేసుకోనున్నాయి. అయితే ఈ పోరాటాల సరళి విషయంలో సిపిఎంతో కొద్దిపాటి విభేదాలు సిపిఐకి ఉన్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లాంటి అంశాలలోనూ వైరుధ్యాలున్నాయి. రెండు పార్టీల పోరాట సరళి విషయంలో తేడాలు వస్తే కాంగ్రెస్‌కు దాన్ని భూతద్దంలో చూపే అవకాశం కల్పించినట్టు అవుతుందని సిపిఐ నాయకత్వం వాదిస్తున్నది. అదీగాక తెలంగాణకు విధానపరంగా తాము అనుకూలమే అయినా, వామపక్ష కూటమిలో భాగస్వామ్య పక్షమైన సిపిఎం అభ్యంతర పెడు తున్నప్పుడు తాము అంగీకరిస్తే జాతీయ స్థాయిలో అడ్డం కులు వస్తాయన్న ఆలోచనతో సిపిఐ ఉన్నట్టు తెలిసింది.
Pages: -1- -2- 3 -4- -5- News Posted: 15 February, 2009
|