మేటాస్ 'హిల్ కౌంటీ'పై చీకట్లు
హైదరాబాద్: మేటాస్ ఇన్ ఫ్రా, మేటాస్ ప్రాపర్టీస్ సంస్థలను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం నిర్ణయించడం వాటి ప్రధాన ప్రాజెక్ట్ 'మేటాస్ హిల్ కౌంటీ' భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నది. అపార్ట్ మెంట్లు, విల్లాలు, బంగళాలు, వాణిజ్య సంస్థల భవనాలు, ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఇజజ్)లు ఆఫర్ చేస్తూ నిజాంపేట సమీపంలోని బాచుపల్లిలో 2005లో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
ఐటి సంస్థల అవసరాలు తీర్చడానికై మైసమ్మగూడ, గోపనపల్లి గ్రామాలలో ఎస్ఇజడ్ లను ఏర్పాటు చేయడానికి రూ. 2500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మేటాస్ ప్రకటించింది. గృహవసతి కల్పనకు దశల వారీగా అదనంగా రూ. 2500 కోట్లు వెచ్చించాలని కూడా సంస్థ సంకల్పించింది. సంస్థ హిల్ కౌంటీ వద్ద మొదటి దశలో సుమారు 350 విల్లాలను, 1150 ఫ్లాట్లను నిర్మిస్తున్నది. వాటిలో చాలా వరకు పూర్తి కాబోతున్నాయి కూడా.
సత్యం గ్రూపుకు గల పేరు ప్రతిష్ఠలను ఆధారం చేసుకుని మేటాస్ సంస్థ ఈ ప్రాజెక్టుకు అధిక సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించగలిగింది. అనూహ్య స్థాయిలో స్పందన రావడంతో సంస్థ ఉన్నతాధికారులు విల్లాలను సగటున కోటి 80 లక్షల రూపాయలకు విక్రయించాలని నిర్ణయించారు. అపార్ట్ మెంట్లను రూ 75 లక్షలు, రూ. 1.5 కోట్లు మధ్య ధరలకు విక్రయించాలని తలపెట్టారు.
Pages: 1 -2- News Posted: 19 February, 2009
|