మేటాస్ 'హిల్ కౌంటీ'పై చీకట్లు
కాగా, విల్లాలు, అపార్ట్ మెంట్లు బుక్ చేసుకున్న పలువురు కస్టమర్లు గత జనవరిలో సత్యం కుంభకోణం బట్టబయలైన వెంటనే తమ డిపాజిట్లు వాపసు చేయాలని యాజమాన్యాన్ని కోరసాగారు. ఇప్పుడు మేటాస్ ప్రాపర్టీస్ యాజమాన్యాన్ని మార్చేందుకు ప్రభుత్వం పూనుకుంటండడంతో కస్టమర్లు మరింతగా కలవరపడుతున్నారు. మొత్తం ప్రాజెక్టు లీగల్ వివాదాలలో చిక్కుకుంటే తమ డిపాజిట్లు తిరిగి రావేమోనని వారు భయపడుతున్నారు.
'సత్యం గ్రూపులో ప్రస్తుత సంక్షోభం వల్ల ఈ ప్రాజెక్టుపై ఎటువంటి వ్యతిరేక ప్రభావమూ పడదని చెబుతూ తమతో సహకరించవలసిందిగా మమ్మల్ని కోరుతూ కంపెనీ ఇమెయిల్స్, లేఖలు పంపుతున్నది' అని ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్న కస్టమర్ ఒకరు తెలియజేశారు. 'అయితే, మేము గృహ ప్రవేశం కార్యక్రమాన్ని తలపెడుతున్న సమయంలో ఇలా జరగడాన్ని ఒక అపశకునంగా భావిస్తున్నాం. ఒప్పందాలు రద్దు చేసుకోవాలని మేము నిశ్చయించుకున్నాం' అని ఆ కస్టమర్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 19 February, 2009
|