20 వేలకే 17 ఏళ్ళ వధువు!
ఉత్తర ప్రదేశ్ సహరాన్ పూర్ జిల్లాకు చెందిన 41 సంవత్సరాల సంపన్న రైతు విజయ్ సింగ్ ఆమెను ఇంటికి తీసుకువెళ్ళాడు. ఒక వారం తరువాత నీ తల్లి మరణించిందని, నీకు మరెవ్వరూ లేనందున తనతోనే ఉండిపోవడం సముచితమని సునీతతో అతను చెప్పాడు. ఇంకా 'నీ కోసం నేను రూ. 20,000 చెల్లించాను. నువ్వు ఇకమీదట నా భార్యవి' అని కూడా సింగ్ ఆమెతో చెప్పాడు. ఒక నెల పాటు సునీతను సింగ్ శారీరకంగా హింసిస్తూ, సెక్స్ కోరికలు తీర్చుకుంటూ వచ్చాడు.
ఒక రోజు సునీత రాంచిలో తన పొరుగింటిలో నివసించే ఒక వ్యక్తిని పిలిచి తన తల్లి గురించి వాకబు చేయవలసిందిగా కోరగలిగింది. ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తూ, తన తల్లి బతికే ఉందని, తన ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నదని ఆ వ్యక్తి సునీతతో చెప్పాడు. బచ్ పన్ బచావో ఆందోళన్ (బిబిఎ) అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్ జిఒ) సభ్యులు సునీత ఆచూకీ కనుగొనగలిగారు. వారు ఇప్పుడు ఆమెను ఆమె తల్లి దగ్గరకు చేర్చేందుకు కృషి చేస్తున్నారు.
సునీతను రక్షించేందుకు ఆమె తల్లి, బిబిఎ కార్యకర్తలు రాబోతున్న విషయం తెలియని విజయ్ సింగ్ ఫోన్ లో 'డిఎన్ఎ' విలేఖరితో మాట్లాడుతూ, 'నేను (ఆమె కోసం) రూ. 20,000 చెల్లించాను. ఆమె నాకు బద్ధురాలై ఉండాలి. ఆమె ఇప్పుడు నా భార్య. ఆమె ఇప్పుడు ఇక్కడే ఉండవలసి ఉంటుంది' అని చెప్పాడు. అయితే, 'నేను నీ భర్తనని అతనితో చెప్పు' అని సునీతతో ఖరాఖండీగా అని అతను ఆమెను ఈ విలేఖరితో మాట్లాడేందుకు అనుమతించాడు.
సునీత ఫోన్ అందుకుని 'నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు. నేను ఈ ఇంటికి వచ్చిన తరువాత నా తల్లి మరణించిందని, సింగ్ సాహెబ్ నా భర్త అని నాతో చెప్పారు' అని పేర్కొన్నది. ఆమె ఆతరువాత ఒక్కసారి భోరుమంటూ 'నా జీవితం సర్వనాశనమైంది' అని అన్నది. ఆమె ఇంకా మాట్లాడే లోపలే ఫోన్ లైన్ ను అర్ధంతరంగా కట్ చేశారు.
Pages: -1- 2 News Posted: 23 February, 2009
|