ఊబకాయం ప్రాణాంతకం
సాధారణ శారీరక బరువుతో ఉన్న వారిలో మరణాల రేటు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో ఊబకాయుల్లో మరణాల రేటును అధికంగా గుర్తించడం జరిగింది. 18 ఏళ్ళ వయసులో సాధారణ బరువుతో ఉన్న వారి కంటే అధిక బరువు ఉన్న వారిలో మూడవ వంతు వారు అకాల మృత్యు ప్రమాదాన్ని ఎదుర్కొంటుంటే, ఆ వయసులో ఊబకాయ సమస్యను ఎదుర్కునే వారు రెండింతలు అధికంగా అకాల మృత్యు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని ఆ అధ్యయనం తెలిపింది. స్మోమింగ్ అలవాటు ఎలా ఉన్నప్పటికి 18 ఏళ్ల వయసులో సన్నగా ఉండేవారిలో అకాల మృత్యు ప్రమాదంలో పెద్దగా మార్పేమీ లేదు. అదే సమయంలో బిఎమ్ఈ 17 కంటే తక్కువగా ఉన్న టీనేజర్లకు అకాల మృత్యు ప్రమాదం ఊబకాయులతో సమావం ఉండటం విశేషం.
రోజూ తాగుతున్న సిగిరెట్ల సంఖ్యపై అకాల మృత్యు ప్రమాదం ఆధారపడి ఉంటుందని శాస్త్ర పరిశోధనలు తెలియజేశాయి. సిగిరెట్లు తాగే సంఖ్య పెరిగే కొద్దీ అకాల మృత్యు ప్రమాదం పెరగిపోతుంది. హెవీ స్మోకర్స్ లో ఆ అలవాటు లేనివారితో పోలిస్తే అకాల మృత్యు ప్రమాదం రెండింతలు పెరిగిపోతుంది. అయితే ఊబకాయులు హెవి స్మోకర్లుగా మారిన సందర్భంలో అకాల మృత్యు ప్రమాదం మరింతగా పెరిగలేదని ఆ అధ్యయనం తెలియజేసింది.
Pages: -1- 2 News Posted: 26 February, 2009
|