పెళ్ళి పందిట్లో మాంద్యం!
అధిక సంఖ్యలో అతిథుల కోసం ఆర్భాటంగా ఏర్పాట్లు చేయడం వల్ల ఎవరికైనా భారీగానే డబ్బు ఖర్చు అవుతుంది. అయితే, ఆతిథ్య (హాస్పిటాలిటీ) పరిశ్రమలో స్నేహితుడు కనుక ఉంటే డబ్బు ఆదా కూడా చేయవచ్చునని బాష్ కంపెనీలో పని చేసే కె. శ్రీకాంత్ నాయుడు అంటున్నారు. 'ఒక మంచి స్నేహితుడు మొత్తం కేటరింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అతను ఈ పరిశ్రమలో ఉన్నందున ఆర్భాటంగానే ఏర్పాట్లు చేశాడు. ప్రొఫెషనల్స్ తో సమానంగా అన్నీ ఏర్పాటు చేశాడు. అయితే, నాకు పెద్దగా ఖర్చేమీ కాలేదు' అని శ్రీకాంత్ నాయుడు చెప్పారు.
ప్రతి జంట పకడ్బందీగా వివాహం జరగాలని కలలు కంటుంటుంది. అయితే, ఆర్థిక పరిస్థితులు సవ్యంగా లేకపోవడంతో మనం ఖర్చులు తగ్గించుకోవాలంటే ఖరీదైన వేదికల జోలికి పోకపోవడమే మేలు. తన పూర్వీకుల ఇంటిలో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్న ప్రియాంక అగ్రవాలా మాట్లాడుతూ, 'పూర్వపు సంప్రదాయాలను తిరిగి పాటించడం ఈ ఆర్థిక మాంద్యం సమయంలో నా వంటి వారికి ప్రయోజనకరం కాగలదు. వేదికపై అధిక మొత్తం వెచ్చించే బదులు పూర్వీకుల ఇంటిని వేదికను చేసుకోవడం నా పెళ్ళికి పక్కా సెట్టింగ్ గా ఉపయోగించింది. ఈ ఒక్క నిర్ణయం వల్ల రెండు లక్షల రూపాయలు ఆదా చేశాం. ఈ ఇల్లు మాకు ఎన్నో తీపి గుర్తులు తీసుకువచ్చినందున ఇది స్పెషల్ గా కూడా భాసించింది' అని చెప్పింది.
స్నేహితులు, బంధువులు పెళ్ళి ఏర్పాట్లకు సాయం చేస్తామంటున్నప్పుడు ప్రొఫెషనల్స్ సేవలను ఎవరు కోరుకుంటారు? 'మా బంధువులు, మిత్రులు పెళ్ళి మండపాన్ని, ఇంటిని స్థానికంగా దొరికిన పూలతో అలంకరిస్తున్నారు. ఈ విధంగా నేను ఖర్చులను తగ్గించుకుంటున్నాను' అని ఒక వ్యాపారవేత్త రాజశేఖరరావు తెలియజేశారు. 'అన్ని వేడుకలో వినిపించే సంగీతానికి సంబంధించిన బాధ్యతలను నా స్నేహితులు తీసుకున్నారు. నేను ప్రొఫెషనల్ డిజెను నియోగించుకోలేదు. నా బంధువులందరూ కానుకలను ప్యాక్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విధంగా కూడా నాకు ప్రయోజనం కలిగింది' అని ఆర్ఐఎల్ ఉద్యోగి కె. శ్రీనివాస్ చెప్పారు.
Pages: -1- 2 News Posted: 2 March, 2009
|