త్వరలో నోకియా నెట్ వర్క్
టెలికామ్ మలేషియా, మొబైల్ ఈఎస్పీఎన్, బిటి (బ్రిటీష్ టెలికామ్), వాల్యూ ఫస్ట్ సంస్థలు భారత దేశ నెట్ వర్క్ సర్వసుల రంగంలోకి అడుగు పెట్టేందుకు పావులు కదుపుతున్నాయి. బిటి, వెరిజన్, ఫ్రాన్స్ టెలికామ్ సంస్థలు ఎమ్ విఎన్ ఓ రంగాన్ని ప్రారంభించమని గతంలో ట్రాయ్ ను కోరిన విషయం తెలిసిందే. ఈ ఎమ్ విఎన్ఓ పద్ధతిలో సేవలు అందించే సంస్థలు లైసెన్స్ ఉన్న మొబైల్ ఆపరేటర్ల వద్ద టోకున ఎయిర్ టైమ్ ను కొనుగోలు చేసి, వినియోగదారులకు తిరిగి అమ్ముకుంటారు. లైసెన్స్ ఫీజును పెద్ద ఎత్తున చెల్లించిన రెగ్యులర్ సర్వీసు ప్రొవైడర్స్ వద్ద లైసెన్స్ డ్ ఫ్రీక్వెన్సీ ఉన్నట్లు ఈ ఎమ్ విఎన్ఓ సర్వీసు సంస్థలకు ప్రత్యేకించి ఫ్రీక్వెన్సీ అంటూ ఏదీ ఉండదు.అలాంటి రెగ్యులర్ సర్వీసు ప్రొవైడర్స్ నుండి ఈ సంస్థలు కేవలం ఎయిర్ టైమ్ ను మాత్రమే కొనుగోలు చేస్తాయి.
ఎమ్ విఎన్ఓ సంస్థలు చెల్లించే లైసెన్స్ ఫీజులు కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. భారత దేశ వ్యాప్త ఎమ్ విఎన్ఓ లైసెన్సుకు గాను ప్రభుత్వం 85 కోట్ల రూపాయలను మాత్రమే ప్రవేశ రుసుముగా వసూలు చేయాలనుకుంటోంది. మెట్రో, సర్కిల్ ఏ రాష్ట్రాలకు 5 కోట్ల రూపాయల ప్రవేశ రుసుము, సర్కిల్ బి రాష్ట్రాలకు 3 కోట్ల రూపాయలన ప్రవేశ రుసుము, సర్కిల్ సి రాష్ట్రాలకు ఒక కోటి రూపాయల ప్రవేశ రుసుమును ప్రభుత్వం వసూలు చేయాలనుకుంటోంది. టెలికామ్ కమీషన్ బేస్ ఫీ కింద మెట్రో, సర్కిల్ ఏకు ఒక కోటి రూపాయలను, సర్కిల్ బికి 50 లక్షలు, సర్కిల్ సికి 25 లక్షల రూపాయలను టెలికామ్ సంస్థ వసూలు చేయాలనుకుంటోంది.
Pages: -1- 2 News Posted: 2 March, 2009
|