అద్వానీకి ఒరిస్సా షాక్!
రాష్ట్రంలోని 147 అసెంబ్లీ సీట్లలో కనీసం 100 సీట్లను బిజెడి కోరుతున్నదని, ఆ అభ్యర్థనను పరిశీలించేందుకు బిజెపి సుముఖంగానే ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. అయితే, మరి రెండు లోక్ సభ సీట్లను బిజెపి కోరిందని ఆ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికలలో బిజెడి రాష్ట్రంలోని 21 లోక్ సభ స్థానాలలో 12 స్థానాలకు పోటీ చేసి, బిజెపికి తొమ్మిది స్థానాలను వదిలింది. బిజెడి 84 అసెంబ్లీ సీట్లకు, బిజెపి 63 సీట్లకు పోటీ చేశాయి. అయితే, గత సంవత్సరం చివరిలో భువనేశ్వర్ లో కార్పొరేషన్ ఎన్నికలలో బిజెడి అఖండ విజయం సాధించిన అనంతరం మరిన్ని సీట్ల కోసం పార్టీలో తపన ఎక్కువైంది.
చర్చలు విఫలమైనట్లుగా వెంటనే ప్రకటన చేయరాదని బిజెపి శనివారం రాత్రి నిర్ణయించుకున్నది. ఆదివారం ఢిల్లీలో పార్టీ అగ్ర నాయకులు సమావేశం కావడానికి కొంత వ్యవధి ఇవ్వవలసిందిగా నవీన్ పట్నాయక్ కు బిజెపి విజ్ఞప్తి చేసింది. కాని పట్నాయక్ నేరుగా మీడియాతో మాట్లాడారు. 'బిజెపి ప్రతిపాదించిన సూత్రం మాకు అంగీకారయోగ్యం కాదు' అని అద్వానీ ప్రత్యేక దూత చందన్ మిత్రాతో సమావేశమైన తరువాత కొన్ని నిమిషాలకే పట్నాయక్ విలేకరులతో చెప్పారు.
ఆ తరువాత బిజెపి రాష్ట్ర గవర్నర్ ను కలుసుకుని పట్నాయక్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు తెలియజేసింది. ఎన్నికలకు ముందుగా రాష్ట్రంలో ఒక నెల పాటు రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి కోరింది. ఈ సంకీర్ణం వల్ల బిజెపి 2000 సంవత్సరంలో తూర్పు భారతంలో కాలుమోపడానికి అవకాశం లభించింది. రెండవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ కూటమి పదవీ కాలపరిమితి ముగింపు దశకు వచ్చింది.
Pages: -1- 2 -3- -4- News Posted: 8 March, 2009
|