అద్వానీకి ఒరిస్సా షాక్!
అయితే, క్రైస్తవులకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ ఉధృతంగా సాగించిన ప్రచారం, కంధమాల్ అల్లర్ల వల్ల రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. బిజెపి, బిజెడి మధ్య 'అంతా సవ్యంగా లేదు' అని, సీట్లలో 'అనవసరంగా ఎక్కువ వాటాను బిజెపి పొందుతోందనే అభిప్రాయం బిజెడిలో నెలకొంటున్నద'ని కూడా సిపిఎం గ్రహించింది. అందువల్లే, కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రత్యామ్నాయ కూటమిలో చేరవలసిందిగా పట్నాయక్ కు బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ చాలా కాలంగా కోరుతున్నారు. జనవరిలో కొచ్చిలో జరిగిన సిపిఎం కేంద్ర కమిటీ సమావేశంలో బిజెపిని బిజెడి వదలివేసే అవకాశం గురించి కూడా చర్చించారు.
'రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు బిజెడి మద్దతు ఇవ్వజాలదు. వారు బిజెపి కూటమిలో నుంచి బయటకు వచ్చిన తరువాత బిజెపియేతర, కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ కూటమిలో వారు చేరగలరు' అని సిపిఎం ప్రతినిధి ఒకరు శనివారం సూచించారు. 'తన తండ్రి బిజూ పట్నాయక్ వలె నవీన్ పట్నాయక్ కూడా అత్యంత లౌకికవాది' అని ఆయన పేర్కొన్నారు.
Pages: -1- -2- -3- 4 News Posted: 8 March, 2009
|