అద్వానీకి ఒరిస్సా షాక్!
బిజెడికి మరిన్ని అసెంబ్లీ సీట్లు కేటాయించడానికి బిజెపి సుముఖంగా ఉందని పట్నాయక్ తో మిత్రా శుక్రవారం చెప్పినట్లు, విడిపోతే రెండు పార్టీలకు అవకాశాలు దారుణంగా ఉంటాయని సూచిస్తున్న సర్వే నివేదికను ఆయనకు అందజేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బిజెడికి 11 సీట్లు, బిజెపికి ఏడు సీట్లు ఉండగా రెండు సీట్లు మాత్రమే ఉన్న కాంగ్రెస్ ముక్కోణపు పోటీ జరిగినట్లయితే ఎన్నికలలో పూర్తి విజయం సాధించగలదని ఈ నివేదిక సూచించింది.
పట్నాయక్ తమ వాదనను అర్థం చేసుకున్నారనే అభిప్రాయం బిజెపికి కలిగింది. అయితే, తనను మిత్రా తిరిగి కలుసుకున్నప్పుడు 'పొత్తు లాభదాయకంగా లేదు. మేము విడిగా పోటీ చేయవలసి ఉంటుంది' అని ఆయనతో పట్నాయక్ నిష్కర్షగా చెప్పారు. తాను గెలుచుకోగలమని ఆశిస్తున్న సీట్ల పరంగానే కాకుండా జనతా దళ్ (యు), శివసేన వంటి మిత్ర పక్షాలతో చర్చలలో కూడా బిజెపి స్థితిని కూడా ఈ చీలిక తీవ్రంగా దెబ్బ తీయగలదు. బిజెపితో జెడి (యు),. శివసేన గట్టిగా బేరసారాలు సాగిస్తున్నాయి.
మిత్రా ఈ చీలికను 'అత్యంత దురదృష్టకరం' అని అభివర్ణించారు. ఇది బిజెపికి మరింత వ్యథను కలుగజేస్తుంది. ఎందుకంటే నవీన్ పట్నాయక్ 1997లో జనతా దళ్ లో నుంచి బయటకు వచ్చి బిజెడిని ఏర్పాటు చేసి బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఇందుకు ఆయన ఎంతగానో విమర్శలను ఎదుర్కొన్నారు. తన తండ్రి బిజూ పట్నాయక్ సెక్యులర్ చరిత్రకు అపప్రథ తీసుకువస్తున్నారని కూడా నిందించారు. శివసేన, అకాలీ దళ్ పార్టీలు బిజెపికి సహజసిద్ధమైన మిత్ర పక్షాలు కాగా సెక్యులర్ గ్రూపులు అంతరానిదిగా పరిగణించిన బిజెపికి పట్నాయక్ మద్దతు వల్ల అంగీకారయోగ్యత లభించింది.
Pages: -1- -2- 3 -4- News Posted: 8 March, 2009
|