ముంబై: స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం భారత దేశంపై పెద్ద ప్రభావం వేయసేక పోయినా పాశ్చాత్య ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ముఖ్యంగా సినిమా పతాక సన్నివేశంలోని స్పూర్తి గీతం జయ హో పాశ్చాత్య ప్రపంచంపై గాఢమైన ముద్రను వేసింది. జయ హో గీతాలాపనతో పాటు దాని నృత్యం కూడా పాశ్చాత్య ప్రపంచాన్ని ఊపేస్తోంది. 'బాలీవుడ్ డ్యాన్సులు ఉద్వేగభరితంగా ఉంటాయి. పాటలోని భావాన్ని అర్ధం చేయించే విదంగా డాన్సు సాగుతుంది. జయ హో పాట సారాంశం అజేయంగా నిలవడం. జయ హో అనే పదబంధం ఒక విజయభేరి మోగించడంగా అర్ధం' ఆన్ లైన్ విజ్ఞాన దీపిక ఈ హో డాట్ కామ్ వివరించింది. ప్రతి అంశంతో ఎలా మెలగాలన్న విషయంపై ఈ వెబ్ సైట్ సూచనలిస్తుంది.
ఆస్కార్ పురస్కారాన్ని సాధించిన స్లమ్ డాగ్ మిలియనీర్ పునాదిగా అమెరికాలో ఒక వినూత్న సంస్కృతి రూపొందుతోంది. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో పతాక సన్నివేశంగా ఉన్న ఫ్రెయిదా పింటే, దేవ్ పటేల్ ల జయ హో గీతానికి వేసిన డాన్స్ కు చాలా క్రేజ్ వచ్చింది. స్లమ్ డాగ్ మిలియనీరి చిత్ర నటీ నటుల బృందం ఎమ్మీ అవార్డు ప్రధానోత్సవం కోసం ఎలెన్ డి జనరెస్ హాజరైన సందర్భంలో ఈ డ్యాన్సుకు విపరీతమైన క్రేజ్ మొదలైంది. ఒక టాక్ షోలో టైరా బ్యాంక్స్ కు కథానాయకుడు పటేల్ డ్యాన్స్ తీరును నేర్పించిన అవకాశమొచ్చింది.
గత కొద్ది వారాలుగా తమ పిల్లులు చేసిన జయ హో డాన్సులను ఔత్సాహిక తల్లిదండ్రులు ఇంటర్నెట్ లోకి అప్ లోడ్ చేయడం పెరిగిపోయింది. అదే విధంగా పాశ్చాత్య ప్రపంచంలోని పలువురు డాన్సర్లు తమ సొంత డాన్స్ స్టెప్స్ ద్వారా జయ హో గీతానికి రీమిక్స్ నమూనాలను సృష్టించి ఇంటర్నెట్ వెబ్ సైట్లలో పెడుతున్నారు. 'బెల్లీ డ్యాన్స్' తరహాలో జయ హో గీతానికి నృత్య రీతుల్ని కొంత మంది మహిళలు సృష్టించారు. ఈ నృత్య రీతుల్ని వారు కూడా ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయడమే కాకుండా తమను 'స్లమ్ డాగ్ గ్రాండ్మా' లని పిలుచుకోవడం మరింత విశేషం. అంతేకాదు, స్లమ్ డాగ్ స్పూర్తి గీతాన్ని ఆధారం చేసుకుని పలు పాశ్చాత్య ప్రపంచంలో పలు నృత్య కళాశాలలు పుట్టుకొచ్చాయి