కుదిపేస్తున్న జయ హో
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ యూ ట్యూబ్ లో సైతం జయ హో గీత నృత్యం ఆధరంగా బోధించే ఆన్ లైన్ నృత్యకళాశాలను జింజర్ కొజొలొవస్కీ ప్రారంభించారు. జయ హో నృత్యంలోని వరుసల్లో డ్యాన్స్ చేసే విధానాన్ని ఈ ట్యుటోరియల్ నేర్పిస్తుంది. ఈ డ్యాన్స్ ను విడి విడిగా సులభంగా నేర్చుకునే విధంగా కొజొలోవస్కీ రూపొందించారు. ఈ జయ హో డాన్స్ కు సంబంధించిన ప్రారంభ స్థాయి డ్యాన్స్ ను, మధ్యంతర స్థాయి డ్యాన్స్ ను ఆమె రూపొందించారు. ఆ రెండు నృత్య రీతుల్ని ఆమె ఆన్ లైన్ లో త్వరలో అప్ లోడ్ చేయనున్నారు. 'స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలోని డ్యాన్స చూసి ఉత్సాహ పడ్డాను. లైన్ డ్యాన్సిగ్ కోసం ఆ నృత్యరీతిని స్వీకరించాను. లైన్ డ్యాన్సంటే నాకు చాలా ఇష్టం, నా హాబీ కూడా. ఆ డాన్స్ ను నేను విడగొట్టి ప్రేక్షకులు సులభంగా నేర్చుకునే రీతిలో కొన్ని డాన్సులను రూపొందించాను.'అని ఆమె తెలిపారు.
జయ హో డాన్సర్ గా పేరుపడ్డ యాంజి హెర్మానడెజ్ తన సొంత బాణీలో జయ హో డాన్సులను రూపొందించి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు. ఈ డ్యాన్స్ కు నేపథ్యంలో ఒక టీనేజర్ రూమ్ లోని సన్నివేశాన్ని ఏర్పాటు చేశారు. టీనేజర్స్ రూమ్ లో గోడలకున్న పోస్టర్లు, అడ్డదిడ్డంగా పడేసిన, గోడలకు వేలాడే డ్రస్సులతో కూడిన సన్నివేశాలతో ఈ డాన్స్ సీక్వెన్స్ ను రూపొందించడం జరిగింది. ప్రజలు ఈ తరహా డాన్స్ నేర్చుకునేందుకు తన వద్దకు వస్తారన్న విషయాన్ని ఆమె ఊహించనేలేదు. 'ఈ మధ్యనే నేను ఈ సినిమాలోని డ్యాన్స్ ను చాశాను. చాలా హత్తుకునే విధంగా, చాలా సరదా ఈ పాట సాగుతుంది. నాకు నేను నేర్చుకునేందుకు సిద్దపడ్డాను'అని యాంజి తెలిపారు. నేడు ఆమె స్నేహితులతో సహా పలువురు ఈ డాన్స్ ను నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పలు సినిమా అవార్డుల ఫంక్షన్లలో బాలీవుడ్ స్టార్లు ఈ పాటకు సంబంధించిన డాన్స్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం ఈ పాటను తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. జయ హో ఇంకెన్ని విజయాల్ని సాధించనుందో గదా!
Pages: -1- 2 -3- -4- News Posted: 8 March, 2009
|