కుదిపేస్తున్న జయ హో
స్లమ్ డాగ్ చిత్రం పతాక సన్నివేశ గీతం అన్ని సామాజిక కష్టనష్టాలకు నిర్వాణ గీతంగా నిలిచింది. ఈ నిర్వాణ గీతం, లేదా పరిష్కార గీతం అధారం చేసుకుని చిలవలు పలవలుగా పలు నృత్యాలు రూపొందడమే కాదు, ఒక వినూత్న సంస్కృతి కూడా అమెరికా లాంటి దేశాల్లో పురుడు పోసుకుంది. గతంలో సమాజం సంక్షోభంలో కూరుకు పోయిన పలు సందర్బాల్లో దానికి ప్రతిస్పందనగా వినూత్న, విచిత్ర సంస్కృతులు తలెత్తిన విషయం తెలిసిందే. క్రీస్తు పూర్వం గ్రీకుల కాలంలో సినోప్ కు చెందిన డైజెన్స్ భావజాలంతో ఏర్పడిన మానవ సమూహాల నుండి మొదలుకొని 1896-1908 మధ్య సామాజిక సంక్షోభ కాలంలో జర్మనీ యువకుల్లో తలెత్తిన 'డెర్ వాండర్ వోజెల్' (వలస పక్షి) సంస్కృతి ఒక వినూత్న సమూహానికి పురుడు పోసుకుంది.
వాండర్ వోజెల్ విలక్షణ సంస్కృతి క్రమంగా అమెరికాకు వ్యాపించి 'నేచర్ బాయ్స్' సమూహాల్ని ఏర్పరచింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సంక్షోభ కాలంలో బొహీమియన్లు, బీట్నిక్ లు పేరుతో కొనసాగిన బీట్ తరం కూడా ఇలాంటి విచిత్ర సంస్కృతికి తార్కాణం. అదే సమయంలో 1965 వియత్నాం యుద్ధం కాలంలో తలెత్తిన సామాజిక సంక్షోభానికి ప్రతిస్పందనగా 'హిప్పీ' లనబడే మరో విలక్షణ సంస్కృతి తలెత్తింది. సమాజంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, అరాచకాలు, అన్యాయాలకు ప్రతిక్రియగా యువత ఇలాంటి విచిత్ర సంస్కృతుల్లో పరిష్కార మార్గాలు వెత్తుక్కోవడం చరిత్రలో ప్రతి సంక్షోభ సందర్భంలోనూ జరిగింది. ప్రస్తుతం ప్రపంచం మహా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎలాంటి యుద్ద విపత్తులు దాపురిస్తోయో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈ సామాజికవాతావరణంలో సహజంగానే సమాజంలోని యువతరం ఒక వినూత్న సంస్కృతిలో పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది. హిప్పీ సంస్కృతికి పునాది రాక్ మ్యూజిక్ అయినట్లే బ్యాక్ టు నేచర్ కు జాజ్ మ్యూజిక్ సాంస్కృతిక ప్రతీకలుగా నిలిచాయి. ప్రస్తుత సంక్షోభంలో స్లమ్ డాగ్ మిలియనీర్ లోని పతాక స్పూర్తి గీతం జయ హో మరో వినూత్న సంక్షోభ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందేమో.
Pages: -1- -2- -3- 4 News Posted: 8 March, 2009
|