కుదిపేస్తున్న జయ హో
ప్రపంచ ఆర్ధిక సంక్షోభ కేంద్రమైన పాశ్చాత్య ప్రపంచం మానసిక స్థితి ఉదాసీనతలో కొట్టు మిట్టాడుతోంది. ఇలాంటి మెంటల్ మేకప్ లో ఉన్న ప్రజానీకానికి స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం కథాశం బాగా ఆకట్టుకుంది. భారత దేశ మురికివాడల్లోని దుర్భర దారిద్ర్యం, సమాజంలోను. ప్రభుత్వం లోను రాజ్యమేలుతున్న దాష్టీకం, పాసిజంగా అవతరించిన మత చాందసత్వం, మురికి వాడల బాలలతో సాగే ఉంఛ వ్యాపారం, వ్యభిచారం, వెరసి సామాజిక వాస్తవికతకు ప్రతిబింబంగా ఆ చిత్రం రూపొందింది. అయితే ఈ సామాజిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారానికి 'కాకతాళీయం' (యాదృచ్ఛికత)గా తన జీవితంలోని అనుభవాలు కలసిచ్చే ప్రశ్నలకు సమాధానం ఇచ్చి కోటీశ్వరుడుగా మారిన కథాంశం పాశ్చాత్య ప్రపంచాన్ని కదలించి వేసింది.
ఫలిత ప్రాధాన్య వాదం అంటే లాభంతో ముడిపడిన జీవిత దృక్పథం గల పాశ్చాత్యులకు ఈ చిత్రంలోని సామాజిక రుగ్మతలకు పరిష్కారంగా కధానాయకుడు అర్ధాంతరంగా కోటీశ్వరుడు కావడం తెగ నచ్చేసింది. దాంతో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం పాశ్చాత్య ప్రపంచానికి దిశా నిర్దేశాన్ని చూపించినట్లయింది. ఆర్దిక సంక్షోభంతో అతలాకుతలమవుతున్న జీవితాలకు స్లమ్ డాగ్ చిత్రంలోని అర్ధాంతర పరిష్కారం ఆదర్శంగా నిలిచింది. సామాజిక రుగ్మతలకు అసలైన కారణాన్ని, కారకుల్ని అన్వేషించి వాటిల్ని తొలగించడం ద్వారా సంక్షోభానికి, అరాచకానికి పరిష్కారం కనుగొనాలన్న ఉద్దేశ్యం ఏ కోశాన లేదు. ఏదో అదృష్టం, అద్భుత శక్తి పేరణతో, రొటీన్ కు భిన్నంగా ఒక అధ్బుతం ద్వారా సమస్యలన్నటిని పరిష్కరిచాలన్న స్లమ్ డాగ్ దృక్పథాన్ని సగటు పాశ్చాత్యులకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది.
Pages: -1- -2- 3 -4- News Posted: 8 March, 2009
|