'మొబైల్' మేనర్స్ ఏది?
సెల్ ఫోన్లు వాడేటప్పుడు పాటించవలసిన సాధారణ మర్యాదల గురించి వాడకందారులను చైతన్యం చేయడానికి పరిశ్రమ కూడా చేస్తున్న కృషి పూజ్యమని కమిటీ ఆరోపించింది. 'మొబైల్ ఫోన్ వినియోగదారులు తరచు సెల్ అరుస్తుంటారు, న్యూసెన్స్ సృష్టిస్తుంటారు. ఇతరులకు చిరాకు కలిగించని రీతిలో ఈ సాధనాన్ని ఎక్కడ, ఎలా ఉపయోగించాలో వారికి సుబోధకం చేయవలసిన అగత్యం ఉంది' అని కమిటీ పేర్కొన్నది.
ఫిబ్రవరి 26న రాజ్యసభలో సమర్పించిన తన నివేదికలో కమిటీ మొబైల్ ఫోన్లపై నిషేధం విధించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం అత్యవసర వస్తువు అయిందని కమిటీ పేర్కొన్నది. అయితే, పాఠశాలలకు విద్యార్థులు, క్లాస్ రూమ్ లకు, లేబరేటరీలకు, ఇతర విద్యా ప్రాంతాలకు టీచర్లు సెల్ ఫోన్లను తీసుకువెళ్ళడాన్ని నిషేధించాలని కమిటీ సిఫార్సు చేసింది. 'విద్యా సంస్థలలో ఏదైనా కేంద్ర స్థానంలో లాండ్ లైన్ ఫోన్ ను ఏర్పాటు చేస్తే విద్యార్థులు, టీచర్లు కాల్స్ అందుకోవచ్చు' అని కమిటీ సూచించింది.
Pages: -1- 2 News Posted: 10 March, 2009
|