బాలీవుడ్ 'బ్లాకౌట్'!
ముంబై: భారతదేశంలో వినోదం కలిగించే రెండు 'సి'లు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఏప్రిల్ 10న ప్రారంభం కావలసి ఉన్న క్రికెట్ తమాషా 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' (ఐపిఎల్) భద్రతాపరమైన సమస్యలతో సతమతం అవుతున్నది. చిత్ర రంగం కూడా మరొక సమస్యను ఎదుర్కొంటున్నది. పంపిణీదారులు, మల్టిప్లెక్స్ యజమానుల మధ్య లాభాల పంపిణీపై నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చిత్రపరిశ్రమ నష్టపోయేట్లున్నది. ఏప్రిల్ 3 నుంచి కొత్త చిత్రం దేనినీ విడుదల చేయరాదని నిర్మాతలు, పంపిణీదారులు నిశ్చయించారు.
శక్తిమంతమైన రెండు నిర్మాతల సంఘాలు ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ఎఫ్ పిజి), ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపిపిఎ) తమ వైఖరిని మరింత స్పష్టం చేస్తున్నట్లుగా ఒకే స్క్రీన్ ఉన్న థియేటర్లకు కూడా చిత్రాలు ఇవ్వరాదని నిర్ణయించాయి. 'ఇప్పటికి ఇది బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల విడుదలకు వర్తిస్తుంది. అయితే, దీనిని ప్రాంతీయ చిత్రాలకు కూడా వర్తింపచేయవచ్చు. మల్టీప్లెక్స్ లేదా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అసలు ఏ చిత్రాలూ విడుదల చేయకుండా చూసేందుకు మేము చర్చలు జరుపుతున్నాం' అని ఫిలిమ్, టెలివిజన్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ చైర్మన్ ముఖేష్ భట్ తెలియజేశారు.
ఏప్రిల్ లో విడుదల కావలసిన చిత్రాలలో అనిల్ కపూర్ నటించిన షార్ట్ కట్, కేతన మెహతా తీసిన రంగ్ రసియా, ముక్తా ఆర్ట్స్ తీసిన పేయింగ్ గెస్ట్, సోహైల్ ఖాన్ చిత్రం కిసాన్ ఉన్నాయి. కాగా, ఈ 'బ్లాకౌట్'కు మల్టీప్లెక్స్ లు ఏమీ వెరవడం లేదు. ఐపిఎల్ తో తాము పోటీ పడవలసిన అవసరం ఉండదని గ్రహించి కొందరైతే ఊపిరి పీల్చుకున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 13 March, 2009
|