బాలీవుడ్ 'బ్లాకౌట్'!
'వారు ఎంత కాలం ఇలా భీష్మించుకుని ఉంటారు? వారు తమ చిత్రాలను ప్రదర్శించక తప్పదు కదా! నిషేధానికి ఎంచుకున్న సమయం మాకే మంచిది. ఐపిఎల్ మల్టీప్లెక్స్ లకు నష్టదాయకంగా ఉంటున్నది. అది ప్రేక్షకులను రానివ్వడం లేదు. ఇప్పుడు కొత్త చిత్రాలు విడుదల కాకపోతే ఇటు మాకూ, అటు వారికీ మంచిదే' అని పివిఆర్ సినిమాస్ సంస్థ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
మల్టీప్లెక్స్ యజమానులు తమను నయవంచన చేస్తున్నారని నిర్మాతలు, పంపిణీదారులు ఆరోపిస్తున్నారు. 'చిత్రం విడుదలైన మొదటి నాలుగు వారాలలో లాభాల పంపిణీలో మల్టీప్లెక్స్ యజమానులతో వ్యవహారం చాలా కష్టంగా ఉంటున్నది. ఏదైనా భారీ బడ్జెట్ చిత్రం లేదా అగ్రశ్రేణి తారాగణం ఉన్న చిత్రం విడుదలైన తరువాత మల్టీప్లెక్స్ యజమానులు 18 నుంచి 20 షోల వరకు వేసుకుంటారు. దానితో వారికి దండిగా డబ్బు వస్తుంది. అయితే, వారు లాభాల శాతాన్ని పంపిణీదారులతో కలసి పంచుకోవడానికి నిరాకరించడమే దారుణం' అని నిర్మాతల సంఘం కార్యదర్సి అనిల్ నాగరథ్ ఆరోపించారు.
పివిఆర్, బిగ్ సినిమాస్, ఫేమ్ వంటి మల్టీప్లెక్స్ చెయిన్ ల ఎగ్జిక్యూటివ్ లు అధికారికంగా ఎటువంటి వ్యాఖ్యా చేయడానికి నిరాకరించారు. కాని నిర్మాతలు తమ పరువు కాపాడుకోవడానికి వేసిన ఎత్తే ఈ నిషేధం అని వారు విడిగా వ్యాఖ్యానించారు. 'వరుసపెట్టి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కుదేలవుతున్నాయి. నాణ్యతతో గాని, సరకుతో గాని దీనికి సంబంధం లేదు. మాంద్యం కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. చిన్న నిర్మాతలకు తమ చిత్రాలను విడుదల చేసుకోవడం వినా మార్గాంతరం లేదు. కాని ఈ ట్రేడ్ సంస్థలలో ఆధిపత్యం వహిస్తున్న పెద్ద నిర్మాతలు చిత్రాల విడుదల నిలిపివేతకు మల్టీప్లెక్స్ యజమానులతో వివాదాన్ని ఒక సాకుగా చూపుతున్నారు. జూన్ వరకు భారీ చిత్రాల విడుదలలు ఏవీ ఉండవు' అని ఫేమ్ ఏడ్ లాబ్స్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 -3- News Posted: 13 March, 2009
|