బాలీవుడ్ 'బ్లాకౌట్'!
చివరగా విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం 'ఢిల్లీ 6' అని, దాని వసూళ్ళు ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేవని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మార్చి 6న విడుదలైన 13బి, ధూండ్తే రహే జావోగె, కర్మా ఔర్ హోలి వంటి చిన్న చిత్రాలు సగటున 10 నుంచి 15 శాతం వరకు వసూలు చేస్తున్నాయి. ఆస్కార్ గెలుచుకున్న, ది రీడర్, మిల్క్, ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ వంటి హాలీవుడ్ చిత్రాలు కూడా దెబ్బ తిన్నాయి. వాటి వసూళ్ళు 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే ఉన్నాయి. ఇక ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ఉన్నప్పటికీ 'ది పింక్ పాంథర్' చిత్రం నష్టాల నుంచి బయటపడలేకపోయింది. ప్రేక్షకులను ఆకర్షించేందుకు ముంబై మల్టీప్లెక్స్ లు టిక్కెట్ ధరలను 20 నుంచి 50 శాతం వరకు తగ్గించాయి.
'మా రేట్లు ఇప్పుడు నిజంగా తక్కువ. దీనితో ప్రేరణ చెందిన జనం చిత్రాల వీక్షణకు వస్తున్నారు. ఈ రేట్లు ఇప్పుడు అందుబాటులో లేకపోతే వారు మిస్ కావడమో, వద్దనుకోవడమో జరిగే లేక మల్టీప్లెక్స్ అనుభవం చూద్దామనుకున్న చిత్రాలను చూసేందుకు వస్తున్నారు' అని పివిఆర్ సినిమాస్ సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. పివిఆర్ సినిమాస్ ఇప్పుడు టిక్కెట్ కు రూ. 70, రూ. 250 మధ్య వసూలు చేస్తున్నది. ఇది స్క్రీనింగ్ కు రూ. 50 మేర తక్కువ. కాగా, సింగిల్ స్క్రీన్ యజమానులు తమ మల్టీప్లెక్స్ యజమానుల అభిప్రాయంతో ఏకీభవించారు.
'బిల్లూ వంటి షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం కూడా జనాన్ని ఆకర్షించలేకపోవడం నాకు అంతుపట్టలేదు. సరకు, మాంద్యం, భద్రత సంబంధింత భయాలు, కారణం ఏదైనా కానివ్వండి జనం థియేటర్లకు రావడం లేదు. నేను బిల్లూ చిత్రానికి టిక్కెట్ల రేట్లను రూ. 120, రూ. 180 స్థాయి నుంచి రూ. 65, రూ. 85 స్థాయికి తగ్గించాను. అయినప్పటికీ పరిస్థితి మారలేదు. ఈ పరిస్థితిలో చిత్రాల విడుదలపై పంపిణీదారులు, నిర్మాతలు నిషేధం విధించడం మాకే వరమైంది. వారు మాకు పాఠం నేర్పుతున్నామని భావిస్తున్నారు. కాని కనీసం నిర్వహణ ఖర్చులను ఆదా చేస్తున్నామని ఊరట చెందాం' అని ముంబైలోని జి7 సినిమాస్ సంస్థకు చెందిన మనోజ్ దేశాయ్ చెప్పారు. ఈ సంస్థ పరిధిలో కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి.
Pages: -1- -2- 3 News Posted: 13 March, 2009
|