టాయిలెట్ ఉంటేనే పెళ్ళి!
'ఇళ్లలో టాయిలెట్లు లేని కుటుంబాలతో సంబంధాలు కుదుర్చుకుని వివాహం జరిపించేందుకు అధిక సంఖ్యాక మహిళలు నిరాకరించినప్పుడు, టాయిలెట్ల నిర్మాణాన్ని వ్యతిరేకించే వారి శాతం గణనీయంగా తగ్గిపోయింది' అని దేశ రాజధానికి దాదాపు 150 కిలో మీటర్ల దూరంలో కురుక్షేత్ర జిల్లాలోని ఖాన్ పూర్ కొలియా గ్రామవాసి 70 సంవత్సరాల సత్వంత్ కౌర్ ఆనందంగా చెప్పారు.
జింగిల్స్, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్ల ద్వారా పారిశుద్ధ్యం గురించి చైతన్యం కలిగించడానికి హర్యానా ప్రభుత్వం ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి సుమారు నాలుగేళ్ళు అవుతున్నది. పలు గ్రామాలలోని గోడలపై హిందీలో 'నా బ్యాహుఁ బేటీ ఉస్ ఘర్ మేఁ జిస్మేఁ న హో శౌచాలయ' (టాయిలెట్ లేని ఇంటిలోకి నా కుమార్తెకు పెళ్ళి చేసిన పంపించను) అనే నినాదం రాయించారు.
2005 నుంచి దేశ రాజధానికి మూడు వైపుల ఉండే హర్యానా రాష్ట్రం అంతటా 14.1 లక్షల టాయిలెట్లు నిర్మించారు. సంపూర్ణ పారిశుద్ధ్య ప్రచారోద్యమం కింద 2005 నుంచి ఈ సంవత్సరం జనవరి 31 వరకు నిర్మించిన 14,17,960 టాయిలెట్లలో 9.47,828 టాయిలెట్లు దారిద్ర్య రేఖకు ఎగువన ఉండే (ఎపిఎల్) )కుటుంబాలు కట్టించాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉండే (బిపిఎల్) కుటుంబాలు 4,70,132 టాయిలెట్లను కట్టించాయి. మరొక పారిశుద్ధ్య పథకం కింద, గ్రామంలో ప్రతి ఇంటిలో టాయిలెట్ ను కట్టించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పారితోషికంగా 798 గ్రామ పంచాయతీలు సుమారు రూ. 11.29 కోట్లు అందుకున్నాయి.
Pages: -1- 2 News Posted: 14 March, 2009
|