క్రెడిట్ కార్డుల జోరు తగ్గింది
ముంబై: క్రెడిట్ కార్డులంటే స్టేటస్ సింబల్ గా ఉన్న రోజులు పోయాయి. ఒక వ్యక్తి వినియోగించే క్రెడిట్ కార్డుల సంఖ్య అతని ఆర్ధిక స్థితికి సింబల్ గా నిలిచేది. అయితే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం గణనీయంగా పడిపోయింది. క్రెడిట్ కార్డు వినియోగదారుల బకాయిలు పేరుకుపోవడం, క్రెడిట్ కార్డు వినియోగం గణనీయంగా పడిపోవడంతో కార్డులపై అందించే రుణాలకు బ్యాంకులు పరిమితులను విధించాయి. 2008 ఏప్రిల్ లో క్రెడిట్ కార్డుల ద్వారా 5,611.38 కోట్ల రూపాయలు ఖర్చయితే, 2009 జనవరిలో 5,171.06 కోట్లు మాత్రమే ఖర్చయినాయి. క్రెడిట్ కార్డుల ద్వారా చేస్తున్న ఖర్చు దాదాపు 7.85 శాతం పడిపోయింది.
భిన్నంగా, గత ఏడాది కన్నా ఈ ఏడాది ఖర్చు 28 శాతం పెరిగిందని గణాంకాలు తెలియజేశాయి. గత ఏడాది కాలంగా క్రెడిట్ కార్డుతో సహా ఔట్ స్టాండింగ్ దాదాపు 70 శాతం పెరిగిందని ఆర్ బిఐ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2007 డిసెంబర్ లో 17,306 కోట్ల రూపాయలుగా ఉన్న ఔట్ స్టాండింగ్స్ 2009 డిసెంబర్ నాటికి 29,359 కోట్లకు చేరుకున్నాయి. చాల మంది కార్డు హోల్డర్లు రుణాల్లో కూరుకుపోయిన విషయాన్నికూడా ఈ గణాంకాలు తెలియజేస్తాయి. ఆర్ధి సంక్షోభం కారణంగా ప్రజలు ఖర్చులు తగ్గించుకున్న విషయాన్ని ఈ గణాంకాల ద్వారా అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు ఖర్చు తగ్గించుకోవడమే కాకుండా, బ్యాంకులు క్రెడిట్ కార్డులను కూడా తగ్గిస్తున్నాయి. జనవరిలో 2,82,000 కార్డులు మాత్రమే బ్యాంకులు చలామణీలో ఉంచాయి.
Pages: 1 -2- News Posted: 17 March, 2009
|