తగ్గిన క్రెడిట్ కార్డులు
ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో 2.831 కోట్లుగా ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య 2009 జనవరి నాటికి 8.62 శాతం క్షీణించి 2.587 కోట్ల సంఖ్యకు పడిపోయాయి. అయితే 2007-08 మధ్యకాలం ఇందుకు భిన్నంగా క్రెడిట్ కార్డుల సంఖ్య 13.32 శాతం పెరిగింది. అతి తక్కువగా వినియోగించే వినియోగదారుల, బకాయిల చెల్లించని వినియోగదారుల క్రెడిట్ కార్డులను రద్దు చేసినట్లు యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ సుజన సింగ్ తెలిపారు.ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిలో క్రెడి్ట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించడం లేదని స్టాండర్డ్ చార్డర్ బ్యంక్ అధిపతి శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు. క్రెడిట్ కార్డుల ద్వారా ఆదాయ రహిత ఆస్తుల కొనుగోళ్లు 20 శాతం పెరిగాయి. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ పెరుగుదల కేవలం 5-6 శాతం మాత్రమే ఉంది. బిల్స సకాలంలో చెల్లిస్తున్న వారు కొనుగోలు చేసే సరకుల స్వభావాన్ని బ్యాకర్లు పరిశీలిస్తున్నారు.
ఎస్ బిఐ కార్డుల విషయంలో నాన్-పెర్ ఫార్మెన్స్ అసెట్స్ (ఎన్ పిఏ) కొనుగోలు విలువ 2008 సెప్టంబర్ 30 నాటికి 21.22 శాతంగా ఉందని ఇక్రా గణాంకాలు తెలిపాయి. ఫోర్ క్లోజర్స్, సెటిల్మెంట్స్ సంఖ్య గత ఆరు నెలల్లో 34 లక్షల నుండి 30 లక్షలకు పడిపోవడం ఆధారంగా ఆ సంస్థ ఈ గణాంకాలను రూపొందించింది.అయితే ఈ విషయంపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. క్రెడిట్ పరిమితులను విధించడమే కాకుండా, జీతాల పరిమితిని కూడా క్రెడిట్ కార్డ్ వ్యవస్థకు విధించారు. 8-10 వేల జీతం ఉండేవారికి గతంలో క్రెడిట్ కార్డులను అందించేవారు. అయితే ప్రస్తుతం 20-30 వేల రూపాయల జీతం ఉంటేనే క్రెడిట్ కార్లును బ్యాంకులు జారీచేస్తున్నాయి. ఎక్కువ జీతాగాళ్లకు మాత్రమే క్రెడిట్ కార్డుల సదుపాయం కల్పించడం వల్ల బ్యాంకులకు కొంత సౌలభ్యం కలిగిందని బ్యాంకర్లు తెలిపారు.
Pages: -1- 2 News Posted: 17 March, 2009
|