ఇరవయ్యేడుకే వృద్ధాప్యం!
వృద్ధాప్య ఛాయలు ప్రారంభం కావడానికి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు ఉండవని ముంబై డాక్టర్లు తెలిపారు. 27 ఏళ్ల వయసు నుండి శరీరంలో పుట్టే కణాల కంటే చనిపోయే కణాల సంఖ్య పెరిగిపోతాయని డాక్టర్ పరేష్ దోషి తెలిపారు. ఆయన జస్లోక్ హాస్పిటల్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ గా పనిచేస్తున్నారు. 45 ఏళ్లు దాటిన వారిలో చాలా మందికి స్పాండిలైటిస్, ఆర్థరిటిస్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. అయితే, వెన్నుపాము క్షీణించడం 16 ఏళ్ల వయసు నుండి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. దీని వల్ల భయపడాల్సిన పని లేదు. ఇదంతా జీవన వలయంలో అంతర్భాగమే.
పార్కిన్ సన్ వ్యాధి 60 ఏళ్లనాటి రుగ్మతగా వెలుగుచూస్తందని మనకు తెలుసు. మెదడు కణాల్లో దాదాపు 80 శాతం దెబ్బతిన్న తర్వాత మాత్రమే ఆ జబ్బు ప్రబలంగా ముందుకొస్తాయి. అయితే మెదడు కణాల క్షీణత చాలాకాలం నుండే ప్రారంభమవుతుంది. శరీరంలోని కండరాలకు వ్యాయామం అవసరమైనట్లే, మెదడును కూడా కండరాల వలె ఉపయోగించవలసి ఉంటుందని ప్రవర్తనా మనో శాస్త్రవేత్త డాక్టర్ రామానంద గైక్వాడ్ తెలిపారు. గ్రే కణాలతో వ్యాయామం చేసినట్లయితే, అవి ఆరోగ్యకరంగా కొనసాగుతాయని గైక్వాడ్ తెలిపారు.
Pages: -1- 2 News Posted: 17 March, 2009
|