అస్ట్రాలజీకి బూమ్
బెంగుళూరు: ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ప్రజల ఆశల్ని అడియాసలుగా మార్చి వేసింది. దాంతో ఆర్దిక వికాస కాలంలో మేర మీరిన లాభాలతో వచ్చిన కైపు దిగిపోవడంతో, సమాజంలో నైరాశ్యత ఆవహించింది. నైరాశ్యతకు నిర్లిప్తత తోడు కావడంతో వేదాంతం పుట్టు కొస్తుందని కొడవటిగంటి కుటుంబ రావు తెలిపారు. వేదంతం మాటేమో కాని వేదాంతుల\జ్యోతిష్కుల వద్ద జనం క్యూలు కడుతున్నారు. అపాయింట్ మెంట్లకు ఎగబడుతున్నారు. ఆర్ధిక సంక్షోభ కష్టాలకు ఆధ్యాత్మిక పరిష్కారం కోసం వెంపర్లాట ఎక్కువైంది. దిగాలు పడ్డ పలు భారతీయులు ఆర్ధిక కష్టనష్టాల నుండి గట్టెక్కేందుకు జ్యోతిష్కుల సలహాలు తీసుకునేందుకు బారులు తీరుతున్నారు.
ఐటి పరిశ్రమలో పుట్టుకొచ్చిన నడమంత్రపు సిరి ప్రపంచ సంక్షోభం బద్దలు కాగానే ఒక దెబ్బకు ఆవిరి కావడం పలువురు జీర్ణించుకోలేక పోతున్నారు. ఐటి రంగంలో ఉద్యోగం సంపాదించి వేల, లక్షల రూపాయల జీతాలను అందుకున్నంత కాలం తనంతటి వాడు లేడనే అహంకరంతో సమాజానికంతకూ అతీతుడుగా తనకు తాను భావించుకుంటూ ఏదో గొప్ప విజయం సాధించిన అహంభావంతో విర్రవీగిన ఐటి ప్రబుద్ధులు ఇప్పడు ఏమీ చేయలేక, ఏమీ పాలుపోక, ఏ మార్గం తోచక బిక్క మొహాలేసుకుని ఏదైన అద్బుతం జరగాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
Pages: 1 -2- -3- -4- News Posted: 18 March, 2009
|