అస్ట్రాలజీకి బూమ్
మీనా కపూర్ వెబ్ సైట్ తో పాటు ఫోన్ సలహాలను కూడా ఇస్తుంటారు. రోజుకు కనీసం 10 ఫోన్ కాల్స్ ఐటి, ఫైనాన్స్ రంగ నిపుణుల నుండి వస్తాయని ఆమె తెలిపారు. వారందరూ తమ రంగాల్లో జరగబోయే పరిణామాల పట్ల భయంతో మమ్మల్ని సలహాలు కోరుతుంటారని ఆమె తెలిపారు. చెన్నై కేంద్రంగా పనిచేసే అస్ట్రోగ్యాన్ డాట్ కామ్ వెబ్ సైట్ వ్యాపారం కూడా దాదాపు 10 శాతం వృద్ధి పొందింది. వారిలో చాలా మంది దివాళా తీసిన వారున్నారు. వారు ఐటి లేదా బిపిఓ రంగాలకు చెందిన వారు. ఏదిఏమైనప్పటికీ వారు ఉద్యోగాలు లేదా ఫైనాన్స్ గురించి ఎక్కువగా సలహాలు అడుగుతుంటారు.
పై రెండు వెబ సైట్లే కాకుండా పలు అస్ట్రాలజీ వెబ్ సైట్లకు రాజయోగం పట్టింది. కాసుల వర్షం కురుస్తోంది. ఉదాహరణకు, అకల్ట్ అస్ట్రాలజీ డాట్ కామ్ ను 2007 డిసెంబర్ లో 41,771 మంది సందర్శించగా, 2008 ఫిబ్రవరిలో 64, 522 మంది సందర్శించారు. కేవలం మూడు నెలల కాలంలో సందర్శకుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 18-30 ఏళ్ల లోపు వారు అధికంగా ఈ సైట్ ను సందర్శించినట్లు ఆ సైట్ ప్రాజెక్ట మేనేజర్ నితిన్ రాజ్ తెలిపారు. అదేవిధంగా ఫ్యూచర్ పాయింట్ సంస్థ నడిపే ఇండియన్ అస్ట్రాలజీ డాట్ కామ్ కు ఉద్యోగాలు, పైనాన్స్ వ్యవహారాలకు సంబంధించిన పలు సమస్యలపై సలహాలను కోరుతూ అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల నుండి కూడా ప్రశ్నలు వచ్చినట్లు మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ బన్సాల్ తెలిపారు.
Pages: -1- -2- -3- 4 News Posted: 18 March, 2009
|