అస్ట్రాలజీకి బూమ్
ప్రధానంగా ఇతరుల అజ్ఞానంపై ఆధారపడి నడిచే జ్యోతిష్య వ్యాపారం ఆర్ధిక సంక్షోభంతో ఊపందుకుంది. ఆశ్చర్యకరంగా దేశ శాస్త్ర సాంకేతిక రంగంలో ముందు పీఠిన ఉన్న ఐటి ఉద్యోగులే అస్ట్రాలజీ వెబ్ సైట్ల వెంబడి పరుగులు తీస్తున్నారు. అస్ట్రోయోగి డాట్ కామ్, అస్ట్రోగ్యాన్ డాట్ కామ్ అనే రెండు వెబ్ సైట్లు దాదాపు 10-15శాతం వృద్ధిని సాధించాయి. ఆర్ధిక సంక్షోభంతో తల్లడిల్లుతున్న ఉద్యోగులే ఈ సైట్లను ఎక్కువగా చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సైట్లకు సంబంధించిన పేజీలను 6 వేల నుండి లక్ష మంది వరకు ఒక నెలలో చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదో కొత్త పరిణామం.
ప్రత్యేకించి జనవరి-ఫిబ్రవరి కాలంలో మా సైట్లను చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అస్ట్రోయోగి డాట్ కామ్ సహ వ్యవస్థాపకురాలు మీనా కపూర్ తెలిపారు. ఐటి నిపుణులు, బి స్కూల్ గ్రాడ్యయేట్స్ ఎక్కువగా జ్యోతిష్కులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోందని అమె తెలిపారు. ఆమె వెబ్ సైట్ లో దాదాపు ఒక లక్ష మంది రిజిస్టర్ అయిన వినియోగదారులున్నారు. వారిలో అయిదవ మంది ప్రతి రోజు ప్రశ్నలు పంపిస్తారు. జాబ్స్ సమస్యలు, పదోన్నత సమస్యలపై వారు పలు ప్రశ్నలు సంధిస్తుంటారని ఆమె తెలిపారు.
Pages: -1- -2- 3 -4- News Posted: 18 March, 2009
|