అస్ట్రాలజీకి బూమ్
డాలర్ల లాభాలు వారిని ఒక అభూత సంస్కృతికి లోకి నడిపించాయి. పబ్ లు, డిస్కో థెక్ లు, బ్రాండెడ్ ఐటమ్స్, లాంటి పలు పాశ్చాత్య అలవాట్లకు యువత బానిసలైనారు. వాస్తవ సమాజ చలని నియమాలు వారికి రుచించలేదు. సంక్షోభం కారణంతో ఒక్కసారిగా నేల కూలేటప్పటికి, మరో అభూత ప్రపంచం వైపు ఎగబడుతూ కష్టాలకు పరిష్కారాలను వెతుక్కోవడం పెరిగింది. డబ్బు సంపాదిస్తున్న సమయంలోను వాస్తవానికి విరుద్ధంగా బతికారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో కూడా వాస్తవికతను అర్ధం చేసుకోకుండా జ్యోతిష్కంపై ఎగబడుతున్నారు.
వచ్చేవారం దాకా నా జాబ్ ఉంటుందా? నా సంస్థ యజమాని దెబ్బతింటాడా? నేను రుణ వాయిదాలను సక్రమంగా కట్టగలనా? నా బ్యాంక్ కుప్పకూలుతుందా? లాంటి పలు జీవన్మరణ వాస్తవిక సమస్యలకు సమాధానాలను అస్ట్రాలజీ వెబ్ సైట్లలో వెతుక్కోవడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. భౌతిక ప్రపంచ వాస్తవికతను, సంక్షోభానికి గల వాస్తివిక కారణాలను, కష్టాలకు గల వాస్తవిక కారణాలను వెతుక్కోవడం మానేసి, ఏవే అద్భుతాలు జరిగి జీవితాలు తిరిగి వెలిగిపోగలవన్న ఆశతో జ్యోతిష్యం లాంటి అభూత భావనల వెంట పరుగెత్తుతున్నారు.
Pages: -1- 2 -3- -4- News Posted: 18 March, 2009
|