'నో స్మోకింగ్'కు ఆమె బలి!
అనుపమ ప్రవర్తన తీరు గురించి తాను ఆమె తండ్రి ప్రశాంత్ కు ఎస్ఎంఎస్ పంపినట్లు సమర్ చెప్పాడు. ఆయన వెంటనే తన కుమార్తెకు ఫోన్ చేసి మందలించినట్లు తెలుస్తున్నది. ఆమె కోసం ఆటో తీసుకురావడానికి సమర్ బయటకు వచ్చాడు. కాని భవనం మెట్ల వద్ద సుమారు రెండు గంటల సేపు వారు వాదించుకుంటూనే ఉన్నారు. ఆవేశం పట్టలేకపోయిన అనుపమ ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదరించింది. తెల్లవారు జామున సుమారు 3.20 గంటలకు ఆమె ఐదవ అంతస్తులోకి వెళ్ళి మెట్ల మధ్య గల ఖాళీ ప్రదేశంలోకి దూకినట్లు తెలుస్తున్నది.
సమర్ స్నేహితులు పోవై పోలీసులకు సమాచారం అందజేశారు. అనుపమను రాజావాడి ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆమెను ఆసుపత్రిలో చేర్చుకునే లోపే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు సమర్, మిత్రుల వాఙ్మూలాలను తీసుకుని, ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్నారు. ప్రాథమికంగా ఇది ఆత్మహత్య కేసుగా కనిపిస్తున్నదని, హత్య కాదని పోలీసులు చెప్పారు. యాదృచ్ఛికంగా సంభవించిన మరణమైనా కావచ్చునని వారు అన్నారు. సమర్ ను బెదరించేందుకు అనుపమ ప్రయత్నించిందని, కాని ఆమె కాలు జారి కింద పడిందని వారు చెప్పారు.
ఈ పరిణామానికి దిగ్భ్రాంతికి గురైన సమర్ స్నేహితులు మాట్లాడుతూ, వారిద్దరు గత నెలన్నర రోజులుగా బాగా సన్నిహితంగా మెలగుతున్నారని, వివాహం చేసుకోవాని ఆలోచిస్తున్నారని తెలిపారు. 'వారు చాలా ఆనందంగా ఉన్నారు. సరైన జోడీలా కనిపించారు' అని సమర్ రూమ్ మేట్ చెప్పాడు. 'చిన్న వాదన ఇంతకు దారి తీస్తుందని మేము ఎన్నడూ ఊహించలేదు' అని అతను చెప్పాడు. వారిద్దరిదీ కర్నాటకలోని హుబ్లి అని అతను తెలిపాడు. అనుపమ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికై ఆమె తండ్రి వచ్చారు. అనుపమ గురించి సమర్ బాగా శ్రద్ధ తీసుకునేవాడని, ధూమపానం, మద్య పానం వద్దని ఆమెకు సలహా ఇస్తుండేవాడని ఆయన తెలిపారు. అనుపమ ప్రవర్తన గురించి సమర్ తనకు తెలియజేసినట్లు ఆయన ధ్రువీకరించారు.
Pages: -1- 2 News Posted: 19 March, 2009
|