ప్రతి ద్రవ్యోల్బణం లాభసాటే
ద్రవ్యోల్బణం 0.44 శాతం స్థాయిలో కూడా ధరలు ఒక మోస్తరుగా పెరుగుతున్నాయి. గత వారంతో పోలిస్తే సరకుల ధరలు 7.8 శాతం పెరిగాయి. వినియోగదారుల రీత్యా ప్రతి ద్రవ్యోల్బణం అంటే కొనుగోలు శక్తి పెరగడం. వారి డబ్బు గతంలో కంటే మరిన్ని వస్తువులను, సేవలను కొనగలుగుతుంది. ఆహార పదార్ధాల ధరలు ఇప్పటికీ చాలా అధికంగా ఉన్నాయని, ఆ ధరలు ప్రస్తుత ద్రవ్యోల్బణ అంచనాలో ప్రతిబింబిచడం లేదని ప్రభుత్వ గణాంకాల శాఖ కార్యదర్శి ప్రణబ్ సేన్ తెలిపారు. అయితే ద్రవ్యోల్బణం అపసవ్య దిశలో నడవడం ప్రారంభించినప్పటి నుండి ధరల తగ్గుదల గణనీయంగా ఉంటుందని ఆయన తెలిపారు.
ప్రతి ద్రవ్యోల్బణం వినియోగదారుల డిమాండ్ కుదించదని పలువురు ఆర్ధిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. పొదుపు చేసే సామాన్యులకు ఇది శుభ తరుణం. ప్రజల విశ్వాసం దీనివల్ల పెంపొందుతుంది. గత ఏడాది ద్రవ్యోల్బణం అదుపు తప్పడంతో అందరు ఆందోళన చెందారని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సిఎమ్ డి, అలెన్ సి పెరైరా తెలిపారు. ఖర్చులకు పోను మిగిలిన సొమ్మను దాచుకోగల్గితే సామాన్యులకు లాభం ఉంటుందని ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం తగ్గుదలతోనే సామాన్యులకు లాభం చేకూరదు. టోకు ధరల సూచిక తగ్గడంతో పాటు ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులేర్పడితేనే వినియోగదారలకు లాభం చేకూరుతుందని ఆయన తెలిపారు.
Pages: -1- 2 -3- News Posted: 20 March, 2009
|