ప్రతి ద్రవ్యోల్బణం లాభసాటే
ద్రవ్యోల్బణం మన వద్ద ఉన్న డబ్బు విలువను తగ్గిస్తే, ప్రతి ద్రవ్యోల్బణం మన డబ్బు విలువను పెంచుతుంది. ప్రతి ద్రవ్యోల్బణం డబ్బును దాచుకునేందుకు ప్రజల్ని ప్రొత్సహిస్తుంది. అంటే ద్రవ్యోల్బణ రేటు 6.5 శాతంగా ఉన్న సమయంలోని డిపాజిట్ల విలువ కంటే 1 కంటే తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం ఉన్నప్పటి డిపాజిట్ల విలువ అధికంగా ఉంటుంది. కంపెనీల ఉత్పత్తుల ధరలు తగ్గినప్పటికీ, అదే సమయంలో వాటి ఉత్పత్తి కోసం కొనుగోలు చేసే ముడి సరకుల ధరలు సాపేక్షికంగా చౌకగా ఉంటాయి. ఉక్కు పరిశ్రమను తీసుకుంటే వాటి ఉత్పత్తుల ధరలు లాభాలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఎందుకంటే అవి సేకరించే ముడి సరుకు ధర కూడా సాపేక్షికంగా తగ్గిన విషయాన్ని గుర్తించాలి.
ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు, బ్యాంకులు తీసుకునే వడ్డీ రేట్లు తగ్గినప్పటికీ, ఆర్దిక వ్యవస్థలోని వాస్తవ వడ్డీరేటు ఇప్పటికీ రెండంకెల స్థాయిలోనే ఉంది. ఆర్ధిక వ్యవస్థ తిరిగి పట్టా లెక్కేందుకు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను ఒకే సంఖ్యకు తగ్గించాల్సి ఉంటుందని ఫిక్కీ అధ్యక్షుడు హర్ష్ పాటి సింఘానియా తెలిపారు. ఒకవైపు డిమాండ్ తగ్గుతున్న ఆర్దిక మాంద్యం కాలంలో ధరలు పడిపోవడం ఉత్పత్తి దారులకు నష్టం కలిగిస్తుంది. ఈ ఆర్దిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో టాటా స్టీల్, సెయిల్ సంస్థల నికర లాభాలు 50 శాతానికి పడిపోయాయి. హిండాల్కో అల్యూమినియం సంస్థకు స్వల్ప లాభాలు 544.8 కోట్ల రూపాలు వచ్చాయి. అదే సమయంలో నాల్కో సంస్థకు 33 శాతం నష్టం వాటిల్లింది. అదే విధంగా, హిందుస్తాన్ జింక్ సంస్థకు 56 శాతం నష్టం వాటిల్లింది.
Pages: -1- -2- 3 News Posted: 20 March, 2009
|