ప్రేమ జంటకు మరణశిక్ష!
వారిద్దరు అదృశ్యమైన తరువాత వారి కుటుంబాలు మొదట పోలీసుల వద్దకు వెళ్ళాయి. కాని ఆతరువాత సమస్య పరిష్కారానికై కుల పంచాయతీని ఆ కుటుంబాలు ఆశ్రయించాయి. కలు పంచాయితీ నిర్వహించినట్లుగా భావిస్తున్న పరమ్ జిత్ బనావాలా గ్రామంలో విలేఖరులతో మాట్లాడుతూ, 'జాట్ గౌరవమే ప్రధానం. దానిని ఎట్టి పరిస్థితులలోనూ కాపాడవలసి ఉంటుంది' అని చెప్పారు. ఆ దంపతులకు అక్రమంగా మరణశిక్ష విధించడం గురించి పోలీసులకు తెలిసినప్పటికీ, రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా పార్లమెంటరీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో శక్తిమంతమైన జాట్ కులస్థుల ప్రాబల్యం దృష్ట్యా కిమ్మన్నాస్తిగా ఉండిపోవాలనుకున్నారు.
అయితే, 'చట్టానికి విరుద్ధంగా ఎవరినీ ప్రవర్తించనివ్వబోం' అని జింద్ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్ పి) సతీష్ బాలన్ స్పష్టం చేశారు. 'ఆ యువతీ యువకులు మమ్మల్ని ఆశ్రయించినట్లయితే, వారికి మేము రక్షణ కల్పించగలం' అని ఆయన తెలిపారు. హర్యానాలో జాట్ సమాజంలో కుల పంచాయతీలు రాజ్యాంగేతర అధికార శక్తులుగా వ్యవహరిస్తుండడం, తమ కులానికి వ్యతిరేకంగా ఎవరు నేరానికి పాల్పడినా మరణశిక్ష కూడా విధిస్తుండడం పరిపాటి. గతంలో కూడా ఇటువంటి రాజ్యాంగేతర అధికార శక్తులు జంటలను, కుటుంబాలను వధించడం, వారిపై దౌర్జన్యం చేయడం వంటి పనులకు పాల్పడ్డాయి. అటువంటి జంటలో మనోజ్, బబ్లీ రెండేళ్ళ క్రితం హర్యానాలో ప్రాణాలు పోగొట్టుకున్నారు.
Pages: -1- 2 News Posted: 21 March, 2009
|