నీళ్లు కావు, సెక్స్ హార్మోన్లు
ఈ అధ్యయనం కోసం జర్మనీలో అందుబాటులో ఉండే 20 మినరల్ వాటర్ బ్రాండ్లను ఎంపిక చేశారు. ఈ బ్రాండ్లలో తొమ్మిది బాటిల్స్ గ్లాసుతోను, 9 బాటిల్స్ ప్లాస్టిక్ తోను, రెండు బాటిల్స్ మిశ్రమ పదార్ధాలతోను (లోపల వైపు ప్లాస్టిక్ ఫిల్మ్ ను అంటించిన పేపర్ బోర్డ్ బాక్సులు) తయారు చేసిన వాటిని ఎంపిక చేశారు. 20 బాటిల్స్ లో 60 శాతం బాటిల్స్ లోని నీటిలో (20 బాటిల్స్ లో 12) ఈస్ట్రోజన్ హర్మాన్లను పరిశోధకులు కనుగొన్నారు. గ్లాస్ బాటిల్స్ లోని నీటిలో ఈస్ట్రోజన్ హార్మోన్స్ శాతం చాలా తక్కువగా ఉంది. గ్లాసు బాటిల్స్ లోని నీటిలో 33 శాతంగా ఉన్న హార్మాన్ల కంటే ప్లాస్టిక్ బాటిల్స్ లో 78 శాతంగా ఉంటే, మిశ్రమ బాటిల్స్ లోని నీటిలో మధ్యస్థంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఈ బాటిల్స్ లో నిలువ ఉంచిన నీటిలో న్యూజిల్యాండ్ బురద నీటి నత్తలను పెంచారు. గ్లాస్ బాటిల్స్ లోని నీటిలో పెరిగిన నత్తల్లో ప్లాస్టిక్ బాటిల్స్ నీటిలో పెరిగిన నీటిలోని నత్తల్లో రెండింతలు ఎక్కువ పిండాలు ఏర్పడినట్లు పరిశోధకులు తెలిపారు. దాంతో ప్లాస్టిక్ బాటిల్స్ లో ప్యాకింగ్ చేసిన మినరల్ వాటర్ హార్మోన్లతో కలుషితమైనట్లు ఆ అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయన నివేదికను ఎన్విరాన్ మెంటల్ సైన్స్ అండ్ పొల్యూషన్ రీసెర్చ్ జర్నల్ ప్రచురించింది.
Pages: -1- 2 News Posted: 27 March, 2009
|