లక్కీ స్టూడియోల వైపు పరుగు
చివరకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డికి, టెక్నాలజీని అమితంగా ఇష్టపడే తెలుగుదేశం పార్టీ (టిడిపి) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు కూడా విచిత్రమైన ఎన్నికల నమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు తన తరఫున కుప్పం నియోజకవర్గంలో తన నామినేషన్ పత్రాలను ఒక మహిళ సాయంతో దాఖలు చేయిస్తుంటారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన వెంటనే కుప్పంలో పార్టీ నాయకులు టిడిపి అధినేత ఎన్నికల ఖర్చు కోసం నిధులు సమీకరిస్తుంటారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని చేవెళ్ళ నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తుంటారు. రాష్ట్ర గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్ల ఆయనకు గల 'చెల్లెలి సెంటిమెంట్' ఇందుకు కారణం.
ఇక మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తన నామినేషన్ పత్రం దాఖలు చేసే ముందు ఒక వింత సంప్రదాయం పాటిస్తుంటారు. స్వగ్రామం ధర్మవరంలో తన బంధువు కుటుంబరావుతో ఆయన చెంప దెబ్బ వేయించుకుంటారు. ఈ సంప్రదాయం గురించి ప్రశ్నించినప్పుడు వెంకటేశ్వరరావు సమాధానం ఇస్తూ, 'సమాజం పట్ల నా బాధ్యతను గుర్తెరగడానికి ఈ పద్ధతి దోహదం చేస్తుంది' అని చెప్పారు.
ఇదిలా ఉండగా, టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ కు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ముందు స్వస్థలం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయిపల్లిలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చనలు జరిపించడం సంప్రదాయం.
చిరంజీవి అనేది హనుమంతుడి నామధేయాలలో ఒకటి. మరి మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుడుకు వీరభక్తుడు. హనుమంతుడిని ప్రార్థించుకున్న తరువాతే ఆయన తన కార్యక్రమాలు ప్రారంభిస్తుంటారు.
Pages: -1- 2 News Posted: 4 April, 2009
|