చిరుతో ఫ్యాన్స్ గోడు...
హైదరాబాద్: 'ప్రజారాజ్యం పార్టీలో అసలు ఏమి జరుగుతోంది. అభిమానులకే అందుబాటులో లేకుంటే మిగిలిన వారికి ఎలా అందుబాటులో ఉంటారు? పాతికేళ్లుగా అహరహం అభిమానులుగా అందిస్తున్న సేవా కార్యక్రమాలను విస్మరించారా? అభిమానులకే అందుబాటులో లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? సినిమా వేరు..రాజకీయం వేరు. సినిమా అంటే ఏరియాల వారిగా అమ్ముకుంటాం. అభిమాన (ఫ్యాన్స్) ధనమే ప్రాణంగా పునాదులు వేసుకున్న పార్టీలో బిజినెస్ కు వీలులేదు. ఇవాళ కొత్తగా పార్టీ గ్లామర్ ను సొమ్ము చేసుంకుందామని వచ్చిన వాళ్లనో, వలస పక్షులనో భుజాన్నెత్తుకోవడం భావ్యమేనా? అభిమానులకే అందుబాటులో లేకుంటే ఇక ప్రజల సంగతేమిటి?' అంటూ చిరంజీవి రాష్ట్రవ్యాప్తం అభిమానుల సంఘాలకు చెందిన పలువురు ఆయన ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పలువురు భోరున విలిపించారు. దాంతో చిరంజీవి సహితం కంటతడి పెట్టారు. తనకూ, అభిమానులకూ మధ్య కొంత గ్యాప్ వచ్చిన మాట నిజమే అయినా, ఇకముందు అలా జరగదనీ, తరచు అభిమానులను కలుసుకుని వారి బాగోగులు చూసుకుంటాననీ భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి 11.30 నుంచి 2.30 గంటల వరకూ సుమారు 3 గంటల పాటు చిరంజీవి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులతో 'క్లోజ్డ్ డోర్స్' మీటింగ్ ఏర్పాటు చేశారు.
Pages: 1 -2- -3- -4- News Posted: 7 April, 2009
|