చిరుతో ఫ్యాన్స్ గోడు...
నాక్కూడా తెలియడం లేదు...
చిరంజీవి అభిమాన సంఘాల తరఫున పాతికేళ్లుగా సేవా కార్యక్రమాలు చేపట్టి ఇప్పుడు పార్టీ ఆవిర్భావానికి కారకులైన అభిమానులను గుర్తింపు లేకుండా పోతోందనీ, ఆగస్టు 26న పార్టీ ఆవిర్భావం తర్వాత మీకూ, మాకూ మధ్య అగాధం ఏర్పడిందనీ ఈ సమావేశంలో
పాల్గొన్న పలువురు చిరంజీవితో తమ గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది. 'అలాంటప్పుడు పార్టీ ఎందుకు పెట్టారు? పార్టీల ఫిరాయింపుదారులు, డబ్బున్న బడా బాబులను చేర్చుకున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? మీ గ్లామర్ ను ఉపయోగించుకుని పవర్ లోకి వద్దామని వాళ్లంతా కలలు కంటున్నారు' అంటూ రాయలసీమ నుంచి వచ్చిన అభిమానులు కొందరు భోరున విలపించారు. దీంతో చిరంజీవి సైతం కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. వారికి స్వాంతన వచనాలు చెబుతూ 'అభిమానులతో కొంత గ్యాప్ వచ్చిన మాట నిజమే. వెంకటేశ్వరరావు తొందరపడి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కొన్ని నా దృష్టికి కూడా రావడం లేదు. మిత్రా మినహా మిగిలిన వారంతా అసంతృప్తితో ఉన్నట్టు అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారే' అని చిరంజీవి వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
'మనం పవర్ లోకి వచ్చినా రాకున్నా అభిమాన సంఘాలు ముఖ్యం. అందరూ కష్టపడి పనిచేయండి. అందరూ అండగా ఉండండి. ఇక నుంచి అందరు తరచు కలుసుకుందాం. మన మధ్య ఏర్పడిన గ్యాప్ ను భర్తీ చేసుకుందాం' అని చిరంజీవి అభిమానులకు నచ్చజెప్పినట్టు సమాచారం.
Pages: -1- -2- 3 -4- News Posted: 7 April, 2009
|