చిరుతో ఫ్యాన్స్ గోడు...
సందేహ నివృత్తి కాలేదా?
చిరంజీవి సముఖంలో తమ గోడు వెల్లబోసుకుని కొంత మేరకు ఊరట చెందిన అభిమానులకు ఇంకా పూర్తి సందేహ నివృత్తి జరగలేదని వారి నుంచి సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 'పార్టీలో జరుగుతున్న కొన్ని పరిణామాలు నాక్కూడా తెలియడం లేదు' అని చిరంజీవి అభిప్రాయపడిన విషయాన్ని అభిమానులు విశ్వసించినట్టు కనిపించడం లేదు. పార్టీ అధినేత అయి ఉండి కూడా ఆయనకు పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలు నిజంగానే తెలియడం లేదా? అయితే ఎవరి కనుసన్నల్లో పూర్తి వ్యవహాలు జరుగుతున్నాయి? అల్లు అరవింద్ చక్రం తిప్పుతున్న మాట నిజమేనా? ఇవన్నీ చిరంజీవికి తెలియకుండానే జరుగుతున్నాయంటే విశ్వసించడం ఎలా?...అనే సందేహాలు సమావేశం నుంచి బయటకు వచ్చిన అభిమానుల్లో ఇంకా మిగిలిపోయాయి. 'అధికారం వచ్చినా రాకపోయినా' అని చిరంజీవి నోట రావడం చూస్తే అధికారంలోకి రాగలమనే పూర్తి కాన్ఫిడెన్స్ తో ఆయన మాట్లాడలేదనే అభిప్రాయానికీ తావిచ్చిందట. ఎకాఎకిన పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికీ పట్టపగ్గాలు లేని పరిస్థితి ఉండొచ్చనీ, అలాకాకుండా ఈసారి పట్టు సాధిస్తే భవిష్యత్తులో అధికారం చేపట్టడం నల్లేరు మీద నడకే కావచ్చనే అభిప్రాయం సమావేశం నుంచి బయటకు వచ్చిన పలువురు అభిమానుల్లో వ్యక్తమైంది. మొత్తానికి 'డ్యామేజ్ కంట్రోల్ ' కోసం అధినేత చేసిన 'లేట్ నైట్' చర్చలు అభిమానులకు కొంత స్వాంతన ఇచ్చి...కూసింత అయోమయానికీ తావిచ్చింది.
Pages: -1- -2- -3- 4 News Posted: 7 April, 2009
|