కొడుకు పుట్టాలని....?
ఐదేళ్ళ క్రితం కాలూ సోదరుడు మృతి చెందాడు. గ్రామస్థులు, బంధువులూ కూడా పవిత్ర గంగానదిలో స్నానం చేసి సోదరునికి పుణ్యలోకాలు ప్రసాదించమని కాలూను వేడుకున్నా ఫలితం లేకపోయిందట. ససేమిరా అంటూ అందరి విన్నపాలనూ కాలూ తిరస్కరించాడట. అంతెందుకు కాలూ గారి ఈ విచిత్ర అలవాటు అతని కుటుంబాన్నే అతలాకుతలం చేసినా ఆయన చలించలేదు. ఈ అలవాటుకు ముందు చిన్న పచారీ దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. కాని పళ్ళుతోముకోని, స్నానం చేయని కాలూ దుకాణానికి క్రమేపి వినియోగదారులు రావడం మానేశారు. అది కాస్తా మూత పడింది. ఇప్పుడతను వారణాసి విమానాశ్రయం సమీపంలో చిన్నపాటి వ్యవసాయం చేసుకుంటూ కనిపిస్తాడు.
స్నానం ఎందుకు మానేశావని ఎవరైనా అడిగితే కొడుకు కోసం అని కాలూ చచ్చినా చెప్పడు. పైగా తాను దేశ ప్రయోజనం కోసమే స్నానాన్ని త్యాగం చేసానని ఢంకా భజాయిస్తాడు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకూ తాను స్నానం చేయనని, పళ్ళు తోమనని తన ప్రతిజ్ఞగా చెబుతాడు.
వంశాన్ని ఉద్దరించి, ఊర్ధ్వలోకాలను ప్రసాదించే తనయుని కోసమే కాలూ స్నానం మానేశాడని ఊళ్ళో వారందరూ అంటారు.
Pages: -1- 2 News Posted: 13 May, 2009
|