కూలీ కుర్రాడు టాపర్
కుమార్ చాలా ప్రయాస పడవలసి వచ్చింది. తాను కోల్పోయిన ఎనిమిది నెలల పాఠాలను అతను పూర్తి చేయవలసి వచ్చింది. అతను కొన్ని రోజులు భోజనం కూడా మానివేశాడు. కాని స్కూలుకు రోజూ హాజరయ్యేవాడు. 'ఆయన (రెడ్డి) నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవాలని అనుకున్నాను' అని కుమార్ చెప్పాడు. ఇప్పుడు అతనికి తిరిగి పాత సమస్యే ఎదురవుతున్నది. అదే డబ్బు సమస్య. ఇప్పుడు అతను ఒక హైస్కూలులో చేరాలనుకుంటున్నాడు. కాని పుస్తకాలు కొనేందుకు, మంచి విద్యా సంస్థలో చేరేందుకు కావలసినంత డబ్బు అతని వద్ద లేదు. హైస్కూల్ చదువు అనంతరం సిఎ చేయాలన్న అతని ఆకాంక్ష ఒక క్షణం సాధ్యమయ్యేదిగాను, మరొక క్షణం సుదూర స్వప్నంగాను కనిపిస్తున్నది.
అయితే, తాను ఈ స్థితికి చేరుకోవడానికి దోహదం చేసిన తెగించే ధోరణిని ప్రదర్శిస్తూ కుమార్ సాయం కోసం గుంటూరు జిల్లా కలెక్టర్ జయేష్
రంజన్ ను సంప్రదించాడు. ఈలోగా శివకుమార్ రెడ్డి కూడా ఆ బాలునికి చేయూత ఇచ్చేందుకు కొందరు స్థానిక వాణిజ్యవేత్తలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. శివకుమార్ రెడ్డి సాయం చేసిన మొదటి పేద విద్యార్థి కుమార్ మాత్రం కాడు.
'ఇవి నాకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తున్న క్షణాలు. దారిద్ర్య సంకెళ్ళ నుంచి బయటపడేందుకు నేను సాయం చేసిన మూడవ బాలుడు కుమార్. కర్నూలులో ఒక విత్తనాల ఫ్యాక్టరీలో నుంచి నేను రక్షించిన కె. శివప్రసాద్ తన ఎంబిబిఎస్ పూర్తి చేసి ఇప్పుడు కర్నూలు వైద్య కళాశాలలో హౌస్ సర్జన్ గా శిక్షణ పొందుతున్నాడు. జి. జనార్దన్ అనే మరొక బాలుడు గుంటూరు జిల్లా మిట్టపల్లి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తున్నాడు. జనార్దన్ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం ఎయిడ్స్ తో మరణించారు' అని రెడ్డి తెలిపారు.
Pages: -1- 2 News Posted: 30 May, 2009
|