విశాఖ చేరని ఐటి
అలాగే రుషికొండ ప్రాంతంలో కేవలం ఒక్క సంస్థ మాత్రమే పనిచేస్తోంది. 20కి పైగా సంస్థలు భవన నిర్మాణాలను ఏడాది కాలంగా చేపట్టి ఇప్పటికీ పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని సంస్థలు పునాది రాయే వేయలేదు. ఈ పరిస్థితులు ఇలా ఉంటే, కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం విశాఖలో మరికొన్ని సంస్థలకు భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐ.టి.రంగాన్ని దేదీప్యమానంగా విశాఖలో వెలిగిద్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వం సుమారు 2524 ఎకరాల భూమిని ఏపిఐఐసికి బదలాయించింది. ఐ.టి.కంపెనీలు ఏర్పాటు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఏపిఐఐసి కూడా భూములను తమ వద్దే పెట్టుకుని కూర్చుంది. విశాఖలో ఏర్పాటు చేసిన ఐ.టి. కంపెనీల్లో కనీసం 10వేల మంది స్థానికులకు ఉద్యోగాలు లభించాల్సి ఉంది. ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీల్లో ఒకటి, రెండు కంపెనీలు మినహా మిగిలినవేవీ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వానికి ఇచ్చిన హామీని నెలబెట్టుకోలేకపోయాయి. ప్రభుత్వం రాయితీలు ఇచ్చినా కొన్ని ఐటి కంపెనీలు నిలదొక్కుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. వుడా మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, ప్రాజెక్టులు లేకపోవడంతో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న కొన్ని కంపెనీలు వేరే సంస్థలకు అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరికొంత మంది మాత్రం ఐటి రంగం రంగం ఎత్తిరిల్లే వరకూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు.
హైదరాబాద్, బెంగళూరు, విశాఖల్లోని ఐటి కంపెనీలకు రావల్సిన ప్రాజెక్ట్ వర్క్స్ బ్రెజిల్, ఫిలిఫైన్స్, థైవాన్, చైనా, బీజింగ్ కు వెళ్ళిపోతున్నాయి. మన దేశంలోని ఐటి కంపెనీలు వారానికి ఐదు రోజులు పని దినాలు ఉండడంతో పాటు, ప్రాజెక్ట్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉండడంతో వారానికి ఆరు పనిదినాలు ఉండే పై దేశాలకు తరలిపోతున్నాయి. దీంతో ప్రముఖ కంపెనీలు కూడా కుదేలయ్యే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. ఐటి రంగంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ప్రాజెక్ట్ కాస్ట్ లో 20 నుంచి 30 శాతం ఆదాయంలో కోత విధిస్తుండడం వలన సంస్థల నిర్వహణ కష్టసాధ్యంగా ఉందని ఆయా కంపెనీల యజమానులు తెలియచేస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 19 June, 2009
|