'ఫ్రింజ్' ఎవరికి బెనిఫిట్?
ముంబాయి : కేంద్రం ప్రవేశపెట్టిన 2009 - 10 వార్షిక బడ్జెట్ లో ఉద్యోగుల ప్రోత్సాహకాల పన్నును కంపెనీలకు రద్దు చేసినప్పటికీ ఆ భారం తమపై పడుతుందేమోనని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు లభించే ప్రోత్సాహకాలకు పన్ను విధించే విధానం మార్పు, పరిధిని పెంచడంపై ఆర్థిక శాఖ విధి విధానాలు రూపొందించడంపై ఆదాయ పన్ను నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక బిల్లులో కనిపించిన ప్రస్తావన ఇందుకు కారణమైంది. 'ఉద్యోగులకు ప్రోత్సాహకాల పన్ను (ఎఫ్ బిటి) రద్దు చేసేందుకు 115 డబ్ల్యుఎం సెక్షన్ ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగుల పరిధిలో ప్రోత్సాహకాలపై పన్ను విధించాలి' అని ఆర్థిక బిల్లు ప్రస్తావించింది.
'ఉద్యోగులకు ప్రోత్సాహక పన్ను' ద్వారా గత ఏడాది ప్రభుత్వం రూ. 8,500 కోట్లు ఆదాయం పొందింది. అందుకనే ఈ మొత్తాన్ని ఎలాగైనా ఉద్యోగులపై పన్ను వేయడం ద్వారా రాబట్టాలని చూస్తోంది.
ఆదాయ పన్ను చట్టంలో 17వ సెక్షన్ 3వ నిబంధన ప్రకారం అదనపు ఆదాయాలపై పన్ను విధిస్తారు. ఈ పన్ను 2005లో అమలులోకి వచ్చినప్పటి నుంచీ యజమాని, ఉద్యోగుల జాబితాల్లో తేడాలున్నాయి.
Pages: 1 -2- News Posted: 8 July, 2009
|