'ఫ్రింజ్' ఎవరికి బెనిఫిట్?
ఉద్యోగికి యజమాని కల్పించే సౌకర్యాల్లో పన్ను విధించే జాబితాలో మోటార్ కార్లు, వడ్డీ లేని రుణాలు, పర్యటనలు, ఉచిత ఆహారం, కానుక చిట్టీలు (వోచర్లు), క్లబ్ సభ్యత్వాలు ఉన్నాయి. యజమాని కల్పించే వసతి, తక్కువ వడ్డీ ఋణాలతో పాటు ఇతర అంశాలపై ఉద్యోగులు పన్ను చెల్లించాలి. ఇవన్నీ నిబంధన 3లో ఉంటాయి. కంపెనీ యజమాని పన్ను చెల్లించే జాబితాలో 17 అంశాలు ఉన్నాయి. ఇవి ఉద్యోగుల జాబితాలో ఉన్నప్పటికీ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉద్యోగులకు లక్ష రూపాయలకన్నా ఎక్కువ ప్రోత్సాహకాలు ఉన్న పక్షంలో వారి నుంచి పన్ను వసూలు చేయాలని 2009 ఆర్థిక బిల్లు చెబుతోంది. దీంతో ఎఫ్ బిటి రద్దయిందా? నిబందన 3 కింద విలువ లెక్కగట్టే విధానం దానంత అదే వస్తుందా? అన్న విషయం నిపుణులకు అంతుచిక్కడం లేదు. బడ్జెట్ లో సూచించిన దాని ప్రకారం నూతన విలువ విధానాన్ని ఆర్థిక శాఖ ప్రకటిస్తుందా అన్నది చూడాలి.
'ఒకసారి ఎఫ్ బిటి రద్దయితే నిబంధన 3 దానంతట అదే అమలవుతుందా? లేదా నూతన విలువ అంచనా పథకాన్ని ప్రకటిస్తారా?' అని పన్నుల నిపుణుడు పరిజాద్ సిర్వాలా అభిప్రాయపడ్డారు.
Pages: -1- 2 News Posted: 8 July, 2009
|