అమ్మమ్మలు కావాలి!
ఆస్పత్రుల్లో కనీసం రెండు రోజులైనా నవజాత శిశువులను ఉంచని కారణంగానే శిశు మరణాలు ఎక్కువగా ఉంటన్నాయని అసోంలోని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో తల్లి - బిడ్డ ఆస్పత్రిలో కనీసం రెండు రోజులైనా ఉండేందుకు వారిని ప్రోత్సహించేందుకు 'మమత' పథకాన్ని అసోం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఒక దుప్పటి, కండువా, ఇతర శిశు సంబంధమైన వస్తువులను కానుకగా బాలింతకు ఇస్తారు.
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించేందుకు 'హెల్త్ కార్డు'లను ప్రభుత్వం అందిస్తోంది. వీటి ద్వారా ఒక్కొక్కరూ ఏటా రూ.25 వేల వరకూ చికిత్సను పొందవచ్చు. ఇందుకు కేవలం రూ. 30 ప్రీమియం చెల్లిస్తే చాలు.
Pages: -1- 2 News Posted: 8 July, 2009
|