విశాఖలో బ్రాండిక్స్ సెజ్
విశాఖపట్నం: విశాఖ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో తూర్పు కోస్తా తీరంలోని అచ్యుతాపురం మండలంలో ఏర్పాటు చేసిన ఆర్థిక మండలిలో బ్రాండిక్స్ తన కార్య లాపాలను విస్తరిస్తోంది. ఈ ప్రత్యేక ఆర్థిక మండలిని సుమారు 10 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో జౌళి, మోటారు స్పేర్ పార్టుల తయారు, విద్యుత్‌పరికరాల తయారీ వంటి పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. బ్రాండిక్స్ నేతృత్వంలోని ఈ సెజ్ లో ప్రభుత్వం సూచించిన విధంగా ప్రోసెసింగ్, నాన్ ప్రోసెసింగ్ జోన్లను ఏర్పాటు చేసింది. ప్రోసెసింగ్ జోన్‌లో బట్టల తయారీకి సబంధించిన యార్న్, ఎలాస్టిక్, బటన్స్ తయారీ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నారు. నాన్‌ప్రోసెసింగ్ జోన్‌లో అడ్మిన్‌స్ట్రేటివ్ బిల్డింగ్, రెండు కమర్షియల్ కంప్లెక్సులు, ఫుడ్ కోర్టు లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి ప్రోసెసింగ్ జోన్‌లో పనిచేసే వారి కోసం ఎసి సదుపాయం కలిగిన రెసిడె న్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తోంది.
బ్రాండెడ్ సెజ్‌లో యూరప్, అమెరికా దేశాల నుంచి పలు కంపెనీలను ఇక్కడకు రప్పించేందుకు బ్రాండిక్స్ కంపెనీ ప్రయత్నిస్తోంది. యుకె, మారిషస్, హాంకాంగ్ వంటి దేశాలకు చెందిన ఆరు కంపె నీలు త్వరలో ఇక్కడకు రానున్నాయి.2012 నాటికి 20 నుంచి 25 కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడానికి సంబం ధిత కంపెనీల యాజమాన్యాలతో బ్రాండిక్స్ చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి పైనీర్ ఎలాస్టిక్స్ డెబ్ ఫ్యాక్టరీ, క్వాంటమ్ కంపెనీలు ఇక్కడి సెజ్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించ నున్నా యి. ప్రభుత్వం ఇచ్చిన పన్నుల రాయితీలు ఇతర సౌకర్యా లు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని బ్రాండిక్స్ సంస్థ జనరల్ మేనేజర్ సునీల్ పన్వర్‌తెలిపారు. సామాజిక భద్రత, ప్రజల సౌకర్యాలకు సంబంధించి అన్ని చర్యలూ చేపడుతున్నట్టు సంస్థ పేర్కొంది. ఇందులో భాగంగా పూడిమడక జిల్లా పరిషత్ హైస్కూల్లో భోజన గదులు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు.
Pages: 1 -2- News Posted: 12 July, 2009
|